గగన్ యాన్ కోసం సముద్రయానం పరీక్షలు

Sea trials for the Gaganyaan

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్ యాన్ ముందస్తు పరీక్షలు. పరిశోధనలు ముమ్మరం చేసింది. మరోసారి సముద్రంలో రికవరి పరిశోధనలు మొదలయ్యాయి. భారతీయ నావికాదళం, ఇస్రో సంయుక్తంగా వెల్డెక్ రికవరి ట్రయల్సను విజయవంతంగా నిర్వహించినట్లు మంగళవారం ప్రకటించింది. ఇటీవల ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ పిఎస్ఎల్వి-సి59 విజయం తర్వాత మాట్లాడుతూ మానవ రహిత తొలి ప్రయోగాన్ని 2025 తొలి రోజుల్లో ప్రయోగిస్తామని ప్రకటించారు. ఈ మేరకు అందుకు సంబంధించి ముందస్తు జాగ్రత్త రికవరీ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం తీరంలో వెలెడెక్ షిప్ను ఉపయోగించి తూర్పు నౌకాదళ కమాండ్ ట్రయల్స్ నిర్వహించారు. అంతరక్షంలో ప్రవేశపెట్టిన క్రూమాడ్యూల్ సముద్రాన్ని తాకిన తర్వాత సాధ్యమైనంత తక్కువ సమయంలో సిబ్బంది క్రూమాడ్యూల్ నుంచి క్షేమంగా బయటకు రాగలిగే ప్రయోగమిది. ఒక ఓడలోని వెలెక్ట్ నీటితో నింపి తద్వారా పడవలు, ల్యాండింగ్ క్రాఫ్ట్లు ద్వారా అంతరిక్షం నుంచి పొర పాటున సముద్రంలో వడే వారిని రక్షించడానికి ఇటువంటి సౌకర్యాలను ముందుగా ఏర్పాటు చేసుకుంటున్నారు.

వెలెక్ లోపల సిబ్బందితో పాటు క్రూమాడ్యూల్ను సముద్రం నుంచి లాగి ఓడకు చేర్చడం ఈ పరిశోధన, రికవరీ కోసం ఆపరేషన్ల కార్యక్రమం ట్రయల్స్ సమయంలో ఇండియన్ నేవీ మరియు ఇస్రో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో రికవరీ బాయ్ యొక్క పనితీరును గమనించారు. ఈ కార్యక్రమాల క్రమాన్ని గ్రౌండ్ పిక్చర్లను ధ్రువీకరించారు. ఇంతకుముందు కూడా ఇటువంటి పరిశోధనలు ఇస్రో చేపట్టి ఉంది. అయితే ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక వ్యవస్థలను మరింత మెరుగుపరుచుకొని గగన్యాన్ ముందస్తు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే గగన్యాన్లో విహరించే ఔత్సాహిక యువకులకు శిక్షణ ఇస్తూ ఈ కార్యక్రమానికి ఇస్రో అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Talent competition in public sector. “this move is aimed at protecting the personal data of zimbabweans in an increasingly online world,” said mavetera. Im life coaching ist es mein ziel, sie auf ihrem weg zu persönlichem wachstum und erfolg zu begleiten.