చింతూరు మండలం సర్వేల గ్రామం సమీపంలో మావోయిస్టు మంగళవారం తెల్లవారుజామున కారును దగ్ధం చేశారు. అయితే కారులో ఉన్న వ్యక్తులను మావోయిస్టులు అవహరించారా? లేక భయంతో పారిపోయారా? తెలియాల్సి ఉంది. డిశంబర్ 2 నుండి 8వరకు మావోయిస్టుల వారోత్సవాలు ఉండటంతో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా డిశంబర్1 నుంచే జాతీయ రహదారి యన్. హెచ్. 30పై రాత్రి సమయంలో రాకపోకలను పోలీసులు పూర్తి స్థాయిలో నిలిపివేశారు. ఎటపాక మండలం నెల్లిపాక వద్ద పోలీసులు, సీఆర్పియన్ బలగాలు విధులు నిర్వహిస్తూ భద్రాచలం వైపు నుంచి చింతూరు వచ్చే అన్ని వాహనాలను వయా కూనవరం వైపుగా మళ్ళిస్తున్నారు.
చింతూరు మండలం చట్టి సమీపంలో కూనవరం జంక్షన్ వద్ద చింతూరు పోలీసులు పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి చింతూరు వైపు నుండి జాతీయ రహదారిపై భద్రాచలం వైపు వెళ్ళె అన్ని వాహనాలను కూనవరం మీదుగా భద్రాచలం వలసిందిగా సూచిస్తున్నారు. రాత్రి సమయంలో తిరిగే అన్ని బస్సు సర్వీసులను నిలిపివేశారు. అయినా చింతూరు మండలం సర్వేల వద్ద మావోయిస్టులు కారును దగ్ధం చేయటం, ఘటన స్థలం వద్ద ఎటువంటి ఆనవాళ్లు దొరకకపోవటం, కారుకు సంబంధించి ఏ వ్యక్తులు కూడా ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం తెలియకపోవటం, ఘటన స్థలంలో కారు డీజిల్ ట్యాంక్ మూత తీసి అందులో డీజిల్తో కారును దగ్ధం చేసినట్టు స్వష్టం అవుతుంది.
కారులోకి రోడ్డు ప్రక్కన ఉండే మొద్దులు వేసి కారును దగ్ధం చేయటం సంచలనంగా మారింది. కారుకు సంబంధించిన ఎటువంటి అనవాళ్ళు, అక్కడ లభించలేదు. మావోయిస్టుల పనే అయితె గత ఏడాది డిశంబర్ 20న ఇదే జాతీయ రహదారిపై వీరాపురం వద్ద కారును దగ్ధం చేసిన మావోయిస్టులు కరపత్రాలను ఆ ప్రాంతంలో వదిలి వెళ్లారు. కాని సర్వేల వద్ద జరిగిన ఘటన స్థలంలో ఎటువంటి అనవాళ్ళు లభించలేదు. కారు నెంబర్ కాని, ఎటువంటి వివరాలు లేకపోవటంతో పోలీసులు ఇంటర్ నెంబర్ సహాయంతో చిరునామా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
చింతూరు వైపు నుంచి భద్రాచలం వెళ్ళే వాహనాలు జాతీయ రహదారపై వెళ్ళకుండా, కూనవరం మీదుగా వెళ్ళలని సూచిస్తున్న ఈ ప్రాంతంలో రహస్య రహదారులపై అవగాహన ఉన్న కొందరు చట్టి వద్ద రెడ్డి క్రాస్ భవనం వెనకవైపు నుంచి ఉన్న రోడ్డు మీదుగా జాతీయ రహదారిపైకి సింగనగూడెం వద్ద ప్ర చేసిస్తున్నారు. మరో రహదారి ఛత్తీస్ ఘడ్లోని కుంటకు సమీపంలో ఉన్న చిదుమూరు మీదుగా వయా బుర్కనకోట నుండి జాతీయ రహదారి మీదకు వచ్చి భద్రాచలం వైపు వెళ్ళుతున్నారు. ఈ రెండు మార్గాల్లో వెళ్ళే వాళ్ళు పోలీసుల ఆదేశాలను దిక్కరించి కూనవరం మీదుగా వెళ్ళలేక, పోలీసులు మానవరం చెక్ పాయింట్ కు సంబంధం లేని ప్రాంతం నుంచి ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఎంతమంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు. భయంతో పారిపోయారా లేక కారును దగ్ధం చేసిన మావోయిస్టులు వారిని అవహరించారా?, కారు న్సురెన్స్ కోసం ఏమైనా కారుకు సంబంధించిన వ్యక్తులే ఏదైనా దగ్దం చేశారా? అనే అనుమానాలతో అనేక కోణాల్లో పోలీసులు చూపిలాగుతున్నారు. ఈ ఘటన చింతూరు పరిసర ప్రాంతాలుల్లో ఉబిక్కి పడేలా చేసింది. పోలీసు బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. సాయంత్రం గంటనుంచే జాతీయ రహదారిపై వాహనాలు వెళ్ళకుండా నిలిపివేశారు. నిత్యం వందలాది వాహనాలతో కళకళలాడే జాతీయ రహదారిపై ఒక్క వా స్థానం కూడా లేకపోవటంతో నిశబద్ధ వాతవరణం నెలకొంది. ఇది తాజా పరిస్థితి.