Headlines
RGV bail petition

రాంగోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మూడు కేసుల్లో ముందస్తు మంజూరు చేసిన న్యాయస్థానం. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లపై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్మపై కేసు నమోదయ్యింది. ప్రకాశం జిల్లా మద్దిపాడుతోపాటు రాష్ట్రంలో మరో 8 ప్రాంతాల్లో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. వీటీపై విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రెండుసార్లు ఒంగోలు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. అప్పటినుంచి రాంగోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ముందస్తు బెయిల్‌ కోసం ఇప్పటికే ఆర్టీవీ హైకోర్టును ఆశ్రయించారు.

వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ బెయిల్‌ పిటిషన్‌పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిపింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లపై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్మపై కేసు నమోదయ్యింది. ప్రకాశం జిల్లా మద్దిపాడుతోపాటు రాష్ట్రంలో మరో 8 ప్రాంతాల్లో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. వీటీపై విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రెండుసార్లు ఒంగోలు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. ముందస్తు బెయిల్‌ కోసం ఇప్పటికే ఆర్టీవీ హైకోర్టును ఆశ్రయించారు. వర్మపై శుక్రవారం వరకు వరకు పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదన్నది. నేడు మరోసారి హైకోర్టు విచారణ చేపట్టిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

కాగా, ఇటీవల తనపై నమోదయిన కేసులన్నీ క్వాష్ చేయాలని రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం వర్మపై చర్యలు తీసుకోవద్దని కోరుతూ పోలీసుల నుంచి కేసుల వివరాలను కోరింది. అయితే ఈరోజుతో ఆ గడువు పూర్తి కావడంతో ముందస్తు బెయిల్ పిటీషన్ పై కూడా నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రామ్ గోపాల్ వర్మ పోలీసులకు అందుబాటులో లేకుండా పోవటం.. ఆయన ఫోన్ స్విఛాఫ్ రావటంతో రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కోయంబత్తూరులో ఉన్నారని.. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ సమయంలోనే ఎక్స్ వేదికగా స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. తాను ఎక్కడకూ పారిపోలేదంటూ సమాధానం ఇచ్చారు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారనేది ప్రచారం మాత్రమేనని.. ఇప్పటివరకూు ఆర్జీవీ డెన్‌లోకి పోలీసులు కాలు కూడా పెట్టలేదని రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Click here to get the fox news app . Advantages of overseas domestic helper. Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam.