చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో జాతీయ రహదారిపై వెళుతున్న కారును తగులబెట్టి దుశ్చర్యకు పాల్పడిన మావోయిస్టులు. కారులో ఉన్న ప్రయాణికులను దింపి అనంతరం కారుకు నిప్పుపెట్టారు. ఈ నెల 2 నుంచి 9 వరకు మావోయిస్టుల వారోత్సవాలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు.
కాగా, తగలబడిన కారు చింతూరు నుండి భద్రాచలం వైపు వెళ్తోంది. 30వ నెంబరు జాతీయ రహదారి సరివెల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈనెల 2 నుండి 9 వరకు మావోయిస్టులు వారోత్సవాలకు పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగానే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ మధ్యకాలంలో ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో డబుల్ రోడ్లు నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. నర్సీపట్నం నుంచి చింతపల్లి మీదుగా భద్రాచలం, అటు పాడేరు వైపు రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.
నిర్మాణానికి ఉపయోగించే పరికరాలను మావోయిస్టులు తగలబెడుతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా కారుని తగలబెట్టడంతో విశాఖ మన్యంలో ఏం జరుగుతోందన్న టెన్షన్ నెలకొంది. లేటెస్ట్ ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు.. కూంబింగ్‌లో నిమగ్నమయ్యారు.
కాగా, ఏపీలో మావోయిస్టుల కదలికలు జోరందుకున్నాయా? ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాల్లో మావోలకు ఎదురుదెబ్బలు తగలడంతో ఇటు వైపు ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. చాన్నాళ్లు తర్వాత ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో మావోల కదలికలు మళ్లీ జోరందుకున్నట్లు కనిపిస్తున్నాయి.