రావులపాలెం :
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు పుణ్య క్షేత్రాలను ప్రముఖ సినీ నటుడు సూరావఝుల సుధాకర్ (శుభలేఖ సుధాకర్) సందర్శించారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి వచ్చిన ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి చిత్ర పటం అందజేసారు. అనంతరం ఆయన మండలంలోని ర్యాలి గ్రామంలో వేంచేసియున్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాగవతుల వెంకట రమణమూర్తి ఆశీర్వచనం చేయించి శ్రీ స్వామి వారి శేషవస్త్రం, చిత్రపటం, చరిత్ర పుస్తకంతో సత్కరించారు.