ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని, చంద్రబాబు సంతాపం..

condoled the death of sm krishna

న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ (92) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన వృద్ధాప్యం రిత్యా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారు జామున బెంగళూరు సదాశివనగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఎంఎం కృష్ణ 1999 – 2004 మధ్య కర్ణాటక సీఎంగా పనిచేశారు. యూపీఏ హయాంలో 2009- 2012 మధ్య విదేశాంగ మంత్రిగానూ ఎస్ఎం కృష్ణ పనిచేశారు. దాదాపు 50ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్ఎం కృష్ణ.. 2017లో బీజేపీలో చేరారు. గతేడాది రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

కాగా.. ఎస్ఎం కృష్ణ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన అసాధారణ నేత. తన జీవితాంతం ఇతరుల కోసం పాటుపడ్డారు. కర్ణాటక సీఎంగా ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ఎక్కువ శ్రద్ద చూపేవారు. ఎస్ఎం కృష్ణలో గొప్ప పాఠకుడు, ఆలోచనాపరుడు ఉన్నారని ప్రధాని మోడీ కొనియాడారు.

మరోవైపు ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్ఎం కృష్ణ మరణ వార్త బాధించిందని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో స్నేహపూర్వకంగా పోటీపడేవాళ్లం అని కృష్ణతో గత అనుభవాలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ప్రజల సంక్షేమానికి ఎప్పుడూ ప్రాధాన్యతనిచ్చే నిజమైన నాయకుడు ఎస్ఎం కృష్ణ. కష్ట సమయంలో ఆయన కటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Thеrе wаѕ nо immediate response frоm iѕrаеl, whісh hаѕ соnѕіѕtеntlу ассuѕеd thе un of іnѕtіtutіоnаl bіаѕ against іt. Life und business coaching in wien – tobias judmaier, msc.    lankan t20 league.