జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ఇసుక లారీ ని వెనుక నుంచి వ్యాన్ ఢీకొట్టిన సంఘటనలు మంటలు చెలరేగాయి. వ్యాను ముందు భాగంలో చిక్కుకున్న వ్యాన్ క్లీనర్ మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యాడు. హైవేపై భోగాపురం సమీపంలో నారు పేట పెట్రోల్ బంకు వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న వ్యాన్ వెళ్తోంది. నారు పేట వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న ఇసుక లారీ ని ఢీ కొట్టింది. దీంతో వ్యాన్లో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఢీకొట్టిన సమయంలో వ్యాన్లో చిక్కుకున్న క్లీనర్ బయటికి రాలేకపోవడంతో సజీవ దహనం అయ్యాడు. సిఐ ప్రభాకర్, ఎస్సై లు పాపారావు, సూర్య కుమారి, హైవే సిబ్బంది చేరుకొని జాతీయ రహదారిపై వెళ్తున్న మిగతా వాహనాలకు మనుషులు తగలకుండా చర్యలు తీసుకున్నారు. గాయపడిన వ్యాన్ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు.