ఆరిలోవ హనుమంతువాక వద్ద ఎకరం స్థలంలో 17 గదులతో విశాలముగా నిర్మించిన ఆరిలోవ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ఆదివారం రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమములో భాగంగా మంత్రి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన చేసి నూతన పోలీస్ స్టేషన్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆరిలోవ పోలీస్ స్టేషన్ అంటేనే అందరికీ జాలి ఉండేదని, తుఫాన్ షెల్టర్ భవనంలో ఎప్పుడు ఉంటుందో… ఎ ప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో పోలీస్ స్టేషన్ ఉండేదని, 2018లో శంకుస్థాపన జరిగినా కూడా ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి నోచుకోని దాకానే లేదని తెలిపారు. కూ టమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ శాఖ పై ప్రత్యేక దృష్టి పెట్టి మౌలిక వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. సమాజంలో గుడి, బడి తో పాటు పోలీస్ స్టేషన్ కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు.
ఈ భవనంలో ఏసీబీ కార్యాలయం నిర్మాణం కోసం అదనపు అంతస్తూ నిర్మించడానికి 2.5 కోట్ల రూపాయల నిధులు మంజూరు కోసం ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్ లో ఫర్నిచర్ ఇచ్చిన డివిస్ లేబరేటరీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేద ప్రజలకు మేలు జరుగుతుందని, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి బాటలో నడిపించే ఘనత చంద్రబాబు దేనని తెలిపారు. పోలీస్ స్టేషన్ వద్ద మెరుగైన రహదారి నిమిత్తం జీవీఎంసీ నుండి కోటి రూపాయల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు, కమిషనర్ ఆఫ్ పోలీస్ శంఖబ్రత బాగ్చ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, డీసీపీ అజిత్, డి ఐ జి గోపీనాథ్, ఏసీబీ అన్నపు నరసింహమూర్తి, ఆరిలోవ సి ఐ హెచ్ మల్లేశ్వరరావు తో పాటు పోలీసు ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.