Headlines
MP PA Raghava Reddy 41 A no

ఎంపీ పిఎ రాఘవ రెడ్డి 41 ఏ నోటీసులు జారీ

పులివెందుల : సోషియల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్ ల కేసులో ఎంపీ పిఏ బండి రాఘవ రెడ్డి ఇంటికి పోలీస్ లు వెళ్లి ఈనెల తొమ్మిదవ తేదిన విచారణకు కావాలి అని ఆదివారం సాయంత్రం 41 ఏ నోటీసులు అందించారు. దీనితో నేడు రాఘవ రెడ్డి డీఎస్పీ మురళి నాయక్ వద్ద విచారణకు హాజరు కానున్నారు. ఉదయంనుంచి కొనసాగిన హైడ్రామా ఉదయం నుంచి రాఘవ రెడ్డి వర్సెస్ పోలీస్ లు అన్న రీతిలో హైడ్రామా కొనసాగింది.బండి రాఘవ రెడ్డి ఇంటిలో వున్నారు అన్న సమాచారంతో ఆదివారం ఉదయం పోలీస్ లు విచారణ కు హాజరు కావాలి అని కోరగా నోటీసులు ఇస్తేనే విచారణకు హాజరు అవుతాను అని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బండి రాఘవరెడ్డి పోలీస్ లతో అన్నారు.


ఆదివారం ఎంపీ పిఎ రాఘవ రెడ్డి ఇంటికి వచ్చాడు అనీ సమాచారం రావడంతో పులివెందుల అర్బన్ ఎస్ఐ విష్ణు నారాయణ ఐడి పార్టీ పోలీస్ లతో కలిసి పట్టణంలోని రాఘవ రెడ్డి ఇంటికి వెళ్లి విచారణకు హాజరు కావాలని కోరగా 41ఏ నోటీసులు ఇస్తేనే విచారణకు హాజరు అవుతానని లేకుంటే రాను అని అన్నారు.వైఎస్ఆర్సీపీ విభాగపు న్యాయవాది ఓబుల రెడ్డితో కలిసి రాఘవ రెడ్డి పోలీస్ లతో మాట్లాడుతూ గౌరవ హైకోర్టు ఈ నెల 13 వ తేది వరకు పోలీస్ శాఖ అరెస్ట్ చేయకూడదు అని ఉత్తర్వులు జారీ చేసింది అని కావున విచారణ కు హాజరు కావాలి అంటే నోటీసులు ఇస్తేనే హాజరు అవుతాను అని తెలిపారు. దీనితో పోలీస్ లు చేసేదేమీ ఏమి లేక వెనుదిరిగి వెళ్లిపోయారు. విషయాన్ని ఉన్నత అధికారులకు తెలిపారు.

అజ్ఞాతం వీడిన ఎంపీ పిఎ రాఘవ రెడ్డి సామాజిక మాధ్యమాలలో అసభ్యకర పోస్టులకు సంబంధించి నవంబర్ 8వ తేదిన పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవ్వగా కేసులో ముద్దాయి అయిన వర్రా రవీంద్ర రెడ్డినీ అరెస్ట్ చేయగా పోలీస్ విచారణలో వర్రా ఇచ్చిన వాంగ్మూలంలో ఎంపీ డైరెక్షన్ లో పిఎ రాఘవరెడ్డి సూచనలతో నే పోస్ట్ పెట్టేవాడిని అని చెప్పడంతో రాఘవ రెడ్డి పేరును కేసు నందు నమోదు చేయడం జరిగింది. పోలీసులు రాఘవరెడ్డిని అరెస్టు చేస్తారని ముందుగా సమాచారం అందటంతో గత నెల పదవ తేదీ నుంచి రాఘవ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీస్ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి జల్లెడ పట్టి వెతికినా పోలీస్ లు అదుపులోకి తీసుకోలేక పోయారు. అయితే రాఘవ రెడ్డి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కడప కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు తిరస్కరించడంతో హై కోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఈనెల 13వ తేదీ వరకు పోలీసులు రాఘవరెడ్డి పై ఏటువంటి చర్యలు తీసుకోకూడదు అని మద్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో దాదాపు నెల రోజుల పాటు అజ్ఞాతంలో వున్న రాఘవ రెడ్డి మొదటి సారి ఆదివారం పులివెందులలో ని తన ఇంటికి వచ్చారు. దీంతో ఆదివారం రాఘవరెడ్డి పులివెందుల లోని తన నివాసానికి రావడం జరిగింది.ఇంటికి వచ్చిన రాఘవ రెడ్డి నీ కలిసేందుకు వైకాపా నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లి కలిశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *