Headlines
buddavenkanna

విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న ఫిర్యాదు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసి కేసు నమోదు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తప్పుడు వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన వెంకన్న, ఆ వ్యాఖ్యలు చట్టపరంగా దర్యాప్తు జరపాలని కోరారు.

బుద్ధా వెంకన్న మీడివిజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న ఫిర్యాదుయాతో మాట్లాడుతూ.. కాకినాడ పోర్టు అంశంపై దృష్టి మళ్లించేందుకు విజయసాయి రేడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. జగన్‌ స్కాంలపై విచారణ మొదలవుతుందని తెలుసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు గత ఐదేళ్లలో చేసిన దుర్మార్గాలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారని, ఇప్పుడు ఆ ఫిర్యాదులకు కులం అనే అడ్డంకి తీసుకురావడం తగదని అన్నారు. తమ తప్పులను ఎత్తిచూపిన ప్రతిసారీ కులాన్ని ఆవశ్యకంగా ఉపయోగించడం వైసీపీ నేతల విధానమని వెంకన్న ఆరోపించారు. విజయసాయి , రామచంద్రులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. వైసీపీ నేతల చర్యలు ప్రజా జీవనానికి ప్రమాదకరమని, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *