Headlines
AP Govt is good news for disabled people

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..ప్రజలకు వరుస తీపి కబుర్లు తెలియజేస్తూ వారిలో ఆనందాన్ని , ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతుంది. ఓ పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే మరోపక్క రాష్ట్ర అభివృద్ధికి పెద్ద పీఠం వేస్తూ వస్తుంది. తాజాగా దివ్యాంగులకు గుడ్ న్యూస్ తెలిపింది.

దివ్యాంగుల సంక్షేమానికి కొత్త ఆలోచన తీసుకొచ్చింది సర్కార్. దివ్యాంగులకు స్వతంత్రంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించేందుకు త్రీ వీలర్ వాహనాలను అందించాలని నిర్ణయించింది. ఈ వాహనాలను రూ.లక్ష ఖరీదుతో తయారు చేసి, పూర్తిగా 100% సబ్సిడీతో లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 10 వాహనాల చొప్పున మొత్తం 1750 వాహనాలను అందించనుంది. వీటిని అన్ని సెగ్మెంట్లకు కలిపి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా దివ్యాంగులు ఆర్థిక స్వావలంబనతో పాటు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశం కలుగుతుంది. వాహనాలను పంపిణీ ప్రక్రియ కోసం నాలుగు నెలల్లో టెండర్లు నిర్వహించి, లబ్ధిదారుల చేతులకు వాటిని అందజేయాలని ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయనున్నారు.

మొదటి దశలో డిగ్రీ లేదా ఆపై చదివిన దివ్యాంగులకు, 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఈ వాహనాలు ఇవ్వనున్నారు. ఈ చర్య దివ్యాంగులకు స్వతంత్ర ప్రయాణంలో ఎంతగానో దోహదపడుతుంది. వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఇది ఒక గొప్ప అవకాశమని భావిస్తున్నారు. ఈ పథకంతో దివ్యాంగులకు తమ జీవితాలను మరింత సులభంగా నిర్వహించుకోవడానికి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. ఇది దివ్యాంగుల పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రజల నుంచి కూడా ఈ పథకంపై చక్కని స్పందన వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *