చర్మం అందంగా ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటారు. అందుకోసం మార్కెట్ లోని వివిధ క్రీములు, ఉత్పత్తులు కొనేందుకు చాలా మందికి ఆసక్తి ఉంటుంది . సరైన విధానాన్ని పాటిస్తే, మన చుట్టూ ఉన్న సహజ పదార్థాలు కూడా చర్మానికి మంచి ఆరోగ్యం అందించగలవు.. పాలపొడి కూడా అలాంటి సహజ పదార్థాల్లో ఒకటి. పాలపొడిలోని విటమిన్లు, మినరల్స్ చర్మానికి పోషణ అందించి, ఆరోగ్యంగా తయారుచేస్తాయి.
పాలపొడిలోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది చర్మం మీద మృదుత్వాన్ని తీసుకువస్తుంది, ఇంకా తాజాదనాన్ని పెంచుతుంది. లాక్టిక్ యాసిడ్, చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, కొత్త కణాల పెంపకాన్ని ప్రేరేపిస్తుంది. అలాగే, పాలపొడిలోని కొలాజిన్ ప్రొడక్షన్‌ను పెంచి చర్మం మరింత ఆరోగ్యకరంగా కనిపిస్తుంది.
ఒక బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్లు బియ్యప్పిండి, ఒక టేబుల్ స్పూన్ పాలపొడి, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి పేస్ట్ తయారు చేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి వేయండి.గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చర్మం మృదువుగా మారుతుంది. ఈ మాస్క్ చర్మాన్ని మృదువుగా, నవీనంగా మార్చుతుంది.
చర్మంపై ఉన్న నల్లటి మచ్చలను తొలగించడానికి గులాబీ నీటిని ఉపయోగించవచ్చు.ముప్పావు కప్పు గులాబీ నీటిలో, రెండు టేబుల్ స్పూన్ పాలపొడి, కొద్దిగా పెరుగు, తేనె కలిపి పేస్ట్ తయారు చేయండి.ఈ మిశ్రమాన్ని ముఖం మీద పూతలా వేయండి. కొంత సమయం తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే నల్లటి మచ్చలు తొలగిపోతాయి.
పాలపొడిలో ఉండే పోషకాలు చర్మానికి అవసరమైన తేమను అందించి, చర్మాన్ని మృదువుగా చేస్తాయి.ఈ ప్రక్రియలను నిరంతరం పాటిస్తే, చర్మం ఆరోగ్యంగా మెరిసిపోతుంది. మీరు సహజంగా చర్మాన్ని సంరక్షించాలనుకుంటే, పాలపొడి వంటి సహజ పదార్థాలను తప్పక ఉపయోగించండి.పాలపొడి మరియు ఇతర సహజ పదార్థాలతో చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఈ సులభమైన, సురక్షితమైన పద్ధతులు, ఇంట్లో కూడా తయారుచేయవచ్చు.