Headlines
Earthquakes in Telugu state

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు ..ఇదే తొలిసారి!

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపణలు ఏర్పడ్డాయి. దీనితో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. హైదరాబాద్ నగరంలోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 5.3 గా నమోదయినట్లు తెలిసింది. హైదరాబాద్ తో పాటు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ ప్రాంతాల్లో భూమి కంపించడంతో భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. రెండు నుంచి ఐదు సెకన్ల పాటు భూమి కంపించింది. సింగరేణి బొగ్గుగనులు ఉన్న ప్రాంతాల్లోనూ, గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఈ భూమి కంపించిందని చెబుతున్నారు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అంబర్ పేట్, బోరబండ, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో భూమి కంపించిందని చెబుతున్నారు. ఒక సెకను పాటు నగరంలో భూమి కంపించిందని కొందరు చెబుతున్నారు.

తెలంగాణలో రిక్టర్ స్కేల్ 5.3 గా నమోదయంది. భూమిలోపల 40 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని చెబుతున్నారు. సంగారెడ్డి, బీహెచ్ఎల్ ప్రాంతంలోనూ భూమి స్వల్పంగా కంపించిందని స్థానికులు తెలిపారు. గడ్చిరోలి జిల్లాలోనూ భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. అధికారులు దీనిపై పూర్తి వివరాలు అందించాల్సి ఉంది. గతంలో కాటేదాన్, రాజేంద్రనగర్ లో భూమి కంపించింది. కొన్ని భవనాలు బీటలు కూడా వారాయి. సుమారు అరెళ్ల తరువాత నగరం లోని వనస్థలిపురం, హయత్నగర్, రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, చర్ల, కొత్తగూడెం, మణుగూరు, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు.

బుధవారం ఉదయం 7.27 గంటలు. తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు ప్రారంభమైన సమయం. 2- 5 సెకన్ల వరకు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అత్యధికంగా తెలంగాణలోని ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత కనిపించింది. ఎప్పుడైనా అక్కడక్కడా భూప్రకంపనలు వస్తుంటాయని, కానీ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి చాలా చోట్ల భూమి కదలడం భయానికి గురిచేసిందని ప్రజలు చెబుతున్నారు.

గోదావరి పరివాహక ప్రాంతాల్లో అప్పుడప్పుడు భూమి కంపించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ‘గోదావరి పరివాహక ప్రాంతాలైన పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల వెంట ఫాల్ట్ లైన్ ఉంటుంది. GSI ప్రకారం ఈ ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చే అవకాశం మధ్యస్థంగా ఉంది. ఏప్రిల్ 13,1969న భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతంలోని ఫాల్ట్ లైన్ కారణంగా 5.7 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది’ అని తెలిపారు.

భూకంపాలు ఎందుకు వస్తాయి..అంటే

పర్యావరణానికి నష్టం జరగడం, భూగర్భ జలాన్ని అధికంగా దుర్వినియోగం చేయడం, అడవుల్లో చెట్లు నరకడం తదితర కారణాలతో భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయి. వీటితో పాటు ప్రాజెక్టుల్లో నీటి ఒత్తిడి భూమిపై పడి భూగర్భంలో మార్పులు వచ్చి భూమి కంపిస్తుంది. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కూడా అంతర్గత పొరల్లో సర్దుబాట్ల వల్ల ప్రకంపనలు వస్తుంటాయి. భూప్రకంపనలు కొలిచే సాధనాన్ని ‘సిస్మోమీటర్’ అంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Indoor digital tv antenna hdtv hd aerial. Advantages of overseas domestic helper. Icomaker.