Headlines
chhatrapati shivaji maharaj

Chhatrapati Shivaji:సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది.

మహా వీరుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ . ఈ హిస్టారికల్ డ్రామా భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతోంది.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని మరింత పెంచింది.కాంతారా సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన రిషబ్ శెట్టి, ఇప్పుడు ఈ చిత్రం ద్వారా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఉన్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే తెలుగులో ‘జై హనుమాన్’ చిత్రంలో నటిస్తున్న రిషబ్, ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తన కంటు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోబోతున్నారు.

ఈ చిత్రానికి హిందీ సినీ పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ డిసెంబర్ 3న విడుదలైంది. రిషబ్ శెట్టి ఛత్రపతి శివాజీ పాత్రలో మెరిసిపోతున్న ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శివాజీ జీవితం, నాయకత్వం, దేశభక్తి నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు.

ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ, “ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్ర పోషించడం అనేది నాకు మాటల్లో చెప్పలేనంత గౌరవంగా ఉంది. ఆయన పాత్రలో జీవించడం, అతని నాయకత్వాన్ని తెరపైకి తీసుకురావడం నాకు లభించిన అపూర్వ అవకాశం. ఆయన కథ విన్న క్షణం దానిపై మోజు పెంచుకున్నాను. ఈ పాత్రను సక్రమంగా పోషించి ప్రేక్షకుల ఆశీర్వాదం పొందడం నా లక్ష్యం” అని తెలిపారు.దర్శకుడు సందీప్ సింగ్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, “ఛత్రపతి శివాజీ పాత్రకు రిషబ్ శెట్టి కాకుండా మరెవరినీ ఊహించలేదు. ఇది ఎన్నేళ్లుగా నా కల.

శివాజీ మహారాజ్ జీవితాన్ని తెరపైకి తీసుకురావడం అనేది నా జీవితంలోని ముఖ్యమైన అడుగు. ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక ప్రమాణాలు భారతీయ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లగలవు” అని అన్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం నుంచి అందరికీ ప్రేరణ అందించే ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. రిషబ్ శెట్టి ఈ పాత్రలో ఎలా మెరిసిపోతారో అనేది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

??. Basic implements by domestic helper | 健樂護理有限公司 kl home care ltd. Installing an air conditioning system is a complex process that should always be handled by licensed professionals.