Headlines
A bank employee was brutally murdered in Warangal

వరంగల్‌లో బ్యాంకు ఉద్యోగి దారుణ హత్య

వరంగల్ : వరంగల్ నగరంలో పట్టపగలే హత్య చేసి మృతదేహాన్ని కారులో పెట్టిన ఘటన కలకలం సృష్టించింది. కాళ్లకు తాళ్లు కట్టి హత్య చేసి.. కారులో పెట్టి పరారైన దుండగులు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. మృతుడు హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన బ్యాంక్ ఉద్యోగి వెలుగట్టి రాజా మోహన్‌గా గుర్తించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, మృతుడు బ్యాంక్ ఉద్యోగి కావడంతో ఎవరైనా సుపారీ ఇచ్చి మర్డర్ చేయించి అంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజామోహన్ ను కాళ్లు, చేతులను కట్టేసి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. తాళ్లు, ఇనుప గొలుసులతో బంధించి మరీ కిరాతకంగా హతమార్చారు. రాజా మోహన్ తలపై మూడు చోట్లా, గొంతు సమీపంలో కూడా కత్తి గాట్లు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా రాజా మోహన్‌ను తన కారులోనే హత్య చేసి, మంగళవారం తెల్లవారుజామున 3.49 గంటల ప్రాంతంలో ఆ కారును రంగంపేటలో పార్క్ చేసి ఓ వ్యక్తి వెళ్లిపోయాడు.

ఈ దృశ్యాలన్నీ పక్కనే ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డు కాగా.. పోలీసులు ఆ రికార్డును స్వాధీనం చేసుకున్నారు. అందులో ఓ వ్యక్తి బ్లాక్ స్వెట్టర్ ధరించి కారు వద్ద నుంచి వెళ్తున్నట్టు గుర్తించారు. అతడే హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ham radio antenna switches x 4. For details, please refer to the insurance policy. Icomaker.