కథ నచ్చిందా? దర్శకుడు చెప్పిన పాత్రలో ఒదిగిపోవాలని ఫిక్స్ అయితే విజయ్ దేవరకొండకి అడ్డుఅదుపు ఉండదు. ఆయన మైండ్‌లో ఓ నిర్ణయం తీసుకుంటే దాన్ని సాధించేందుకు చేస్తున్న శ్రమ ఎప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తాజా చిత్రం కోసం విజయ్ ఎంత కష్టపడుతున్నారో తెలుసా? ఫ్యామిలీ స్టార్ లో పక్కింటబ్బాయిలా కనిపించిన విజయ్, ఆ పాత్రలో తన అభినయం చూపించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ప్రతిసారి అలానే ఉంటే బోర్ కొడుతుందన్న సంగతి ఆయనకు తెలుసు.
సినిమా సినిమాకు పాత్రలలోని వైవిధ్యాన్ని చూపించాలి, కథ డిమాండ్ మేరకు రూపాంతరం చెందాలి. అందుకే ఇప్పుడు విజయ్ తన ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను మరింత కఠినంగా కొనసాగిస్తున్నారు.విజయ్ తన కెరీర్‌లో లైగర్ సినిమా కోసం సిక్స్‌ప్యాక్ చేసుకుని, బీస్ట్ మోడ్‌లో కనిపించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాకు విజయ్ చేసిన శ్రమపై అభిమానులు ఆశ్చర్యపోయారు.
“పెళ్లిచూపులు”లో కనిపించిన సాధారణ వ్యక్తి, అర్జున్ రెడ్డి లోని గంభీరమైన పాత్ర, లైగర్ లోని బాక్సర్… వీరు ఒకరేనా? అని అందరూ ప్రశ్నించారు. కానీ ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోకపోయినా, విజయ్ తన ఫిట్‌నెస్‌పై మరలా పూర్తి దృష్టి పెట్టారు.ప్రస్తుతం విజయ్ వీడీ 12 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు, ఈ చిత్రం వచ్చే సమ్మర్‌లో విడుదల కానుంది. అయితే ఇంతలోనే ఆయన తన తదుపరి చిత్రం వీడీ 14 కోసం కూడా సిద్ధమవుతున్నారు.
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా కోసం విజయ్ శారీరకంగా, భావోద్వేగంగా మరింత కష్టపడుతున్నారు.ఈ చిత్రంలో పాత్రకు తగ్గట్టుగాపూర్తి ట్రాన్స్‌ఫర్మేషన్‌లోకి వెళ్తున్నారు అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.విజయ్ దేవరకొండ పాత్రలలో కొత్తదనం చూపించడంలో ఎప్పుడూ ముందుంటారు. పక్కింటి అబ్బాయిలా కనిపించడమా, తిరుగులేని రెబల్ పాత్ర పోషించడమా, బాక్సర్‌గా శక్తివంతమైన ప్రదర్శన ఇవ్వడమా, ఏ పాత్రనైనా విజయ్ తనదైన శైలిలో చూపిస్తారు. వీడీ 12 మరియు వీడీ 14 చిత్రాలతో ఆయన మరోసారి ప్రేక్షకులని విభిన్నంగా ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. అభిమానుల ఆశలపై సరైన చిత్రాలు తీసుకురావడం, దానికి తగిన శ్రమను సమర్పించడం విజయ్ స్పెషాలిటీ. ఇటువంటి అంకితభావంతో విజయ్ దేవరకొండ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతారు.