ఏపీలో అతి తీవ్ర భారీ వర్షాలు పడే ఛాన్స్

imd warns heavy rains in ap and tamil nadu next four days

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫెంగల్’ తుఫాన్ గడిచిన 6గంటల్లో 10 కిమీ వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. పుదుచ్చేరికి 100 కి.మీ, చెన్నైకి 100 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఈ సాయంత్రానికి కారైకాల్- మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

తుపాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుపాను కారణంగా సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది.

తుపాను ప్రభావంతో తీరం వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో ప్రజలు అప్రమతతంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తిరుపతి,నెల్లూరు,ప్రకాశం తీరం వెంబడి 70-90కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

తెలంగాణలో ఇవాళ్టి నుంచి (నవంబర్ 30) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. డిసెంబర్ 1వ తేదీన కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. డిసెంబర్ 2వ తేదీన కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. ఇక 3వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని… ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Ihre vorteile – life coaching das wirkt :. Latest sport news.