త్వరలో తెలంగాణ లో పెట్రోల్, డీజిల్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ పెంపు?

Life tax for petrol and die

పెట్రోల్, డీజిల్ వాహనాలపై విధించే లైఫ్ ట్యాక్స్ కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పోల్చితే తెలంగాణలోనే తక్కువగా ఉన్నట్లు రవాణా శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా త్వరలోనే లైఫ్ ట్యాక్స్ పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ భేటీలో చర్చించిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ట్యాక్స్ పెంచితే ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.

ప్రస్తుతం తెలంగాణ లో టూ వీలర్ల ధర రూ. 50వేలలోపు ఉంటే 9%,రూ.50వేలకంటే ఎక్కువ ఉంటే 12% లైఫ్ ట్యాక్స్ చెల్లించాలి. ఇక కర్ణాటకలో 18%, కేరళలో 20% చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ లో 4 వీలర్ల ధర రూ.5లక్షల్లోపు ఉంటే 13%,రూ.5L-రూ.10Lకు 14%,రూ.10L-రూ.20L 17%,రూ. 20L+ 18% విధిస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో లైఫ్ ట్యాక్స్ 20% నుంచి 21%గా ఉంది. కాగా తెలంగాణ లో ఎలక్ట్రిక్ వెహికల్స్కు లైఫ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.

ఇదే కాదు పెట్రోల్, డీజిల్‌తో నడిచే కొత్త వాహనాలకు విధించే రోడ్‌ ట్యాక్స్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో వాహనాలపై వస్తున్న ఆదాయం, రిజిస్ట్రేషన్‌ విధానం తదితర అంశాలపై కొద్దిరోజుల క్రితం రాష్ట్ర రవాణాశాఖ అధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్రంలో వాహనాలతో వచ్చే ఆదాయం, పన్నుల శ్లాబుల్ని, ఇతర రాష్ట్రాల్లో రోడ్‌ ట్యాక్స్‌ గణాంకాల్ని బేరీజు వేశారు. ఈ వివరాలతో అధికారులు ఓ నివేదిక రూపొందించగా తర్వలో దీన్ని మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించనున్నట్లు సమాచారం. ఈ మేరక మంత్రివర్గ ఉపసంఘం చర్చించి రోడ్‌ ట్యాక్స్‌పై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. The technical storage or access that is used exclusively for anonymous statistical purposes. Latest sport news.