ఏకంగా 11 మందితో.. టీ20ల్లో అరుదైన రికార్డ్

delhi vs manipur

ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఒక విభిన్న ప్రపంచ రికార్డు సృష్టించింది. మణిపూర్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు మొత్తం 11 మంది ఆటగాళ్లతో బౌలింగ్ చేసి, టీ20 క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు సాధించింది. సాధారణంగా టీ20 క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఎన్నో రికార్డులు సృష్టవుతూనే ఉంటాయి.కానీ, ఢిల్లీ జట్టు 11 మంది ఆటగాళ్లతో బౌలింగ్ చేయడం అనేది కొత్తదిగా రికార్డు అయింది. ముందు 9 బౌలర్లతో బౌలింగ్ చేయడం సాధారణం కాగా, ఇది ఫస్ట్ టైమ్ 11 మందితో జరిగింది.మణిపూర్ జట్టు మొదట బాటింగ్ ఎంచుకుంది. ప్రారంభంలోనే వారు ఇబ్బందులలో చిక్కుకున్నారు. ఓపెనర్ కంగ్‌బామ్ ప్రియోజిత్ సింగ్ 0 పరుగులకే ఔట్ అయ్యారు.

ఆ తరువాత ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బధోని తన ఆటగాళ్లందరినీ బౌలింగ్‌కు పెట్టి ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్ తో పాటు అఖిల్ చౌదరి, హర్ష్ త్యాగి, దిగ్వేష్ రాఠి, మయాంక్ రావత్, ఆర్యన్ రాణా, హిమ్మత్ సింగ్, ప్రియాంష్ ఆర్య, యశ్ ధుల్, అనుజ్ రావత్ కూడా బౌలింగ్ చేశారు.దీంతో మణిపూర్ జట్టు 120 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ తరఫున దిగ్వేష్ రాఠీ 8 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. హర్ష్ త్యాగి 2 వికెట్లు, ఆయుష్ బధోని 1 వికెట్ తీసుకున్నారు.

ఒక దశలో మణిపూర్ జట్టు 41 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి,ఆతర్వాత రెక్స్ సింగ్ (23) మరియు అహ్మద్ షా (32) కొంత పోరాటం చేసి 120 పరుగులకు చేరుకున్నారు. ఢిల్లీ జట్టు 120 పరుగుల లక్ష్యాన్ని 9 బంతులు మిగిలి సాధించి, 6 వికెట్లతో విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్ యశ్ ధుల్ అజేయంగా 59 పరుగులు చేశాడు. కానీ మిగతా ఢిల్లీ బ్యాట్స్‌మెన్ మణిపూర్ బౌలర్లతో కొంత ఇబ్బంది పడ్డారు. ఈ మ్యాచ్‌తో ఢిల్లీ జట్టు కొత్త రికార్డు సృష్టించి, టి20 క్రికెట్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని రాశింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Latest sport news. New youtube channel ideas 2020.