కేసీఆర్ చిత్ర‌ప‌టానికి కేటీఆర్ పాలాభిషేకం

ktr kcr

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగి నేటితో 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్‌ జరుపుతున్నాయి. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఆనాటి ఉద్యమాన్ని గుర్తుచేసేందుకు బీఆర్‌ఎస్‌ దీక్షా దివస్‌ నిర్వహిస్తుంది. జిల్లాల ఇన్‌చార్జిల నేతృత్వంలో ర్యాలీలతో పాటు అమరవీరులకు నివాళులు, ఫొటో ఎగ్జిబిషన్‌ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొంటున్నారు.కరీంనగర్, తెలంగాణ భవన్ వేడుకల్లో పాల్గొననున్నారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందులో భాగంగా ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి కరీంనగర్ కు చేరుకున్నారు.

కరీంనగర్ జిల్లా అల్గునూరు వద్ద నిర్వహించిన సభ కోసం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవ్వగా, గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఎల్ఎండి వద్ద కేటీఆర్ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.

అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మండల వైస్ చైర్మన్ బండ ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్ తో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ihre vorteile – life coaching das wirkt :. Retention of your personal data. It reveals how much of the gross revenue translates into actual earnings.