కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారు – ఎర్రబెల్లి

kcr

త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్లో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడవద్దని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగి నేటితో 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్‌ జరుపుతున్నాయి. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఆనాటి ఉద్యమాన్ని గుర్తుచేసేందుకు బీఆర్‌ఎస్‌ దీక్షా దివస్‌ నిర్వహిస్తుంది. జిల్లాల ఇన్‌చార్జిల నేతృత్వంలో ర్యాలీలతో పాటు అమరవీరులకు నివాళులు, ఫొటో ఎగ్జిబిషన్‌ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొంటున్నారు.కరీంనగర్, తెలంగాణ భవన్ వేడుకల్లో పాల్గొననున్నారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందులో భాగంగా ఉదయం హైదరాబాద్ నుంచి కరీంనగర్ బయలుదేరారు

సిద్ధిపేటలో మాజీ మంత్రి హరీష్‌రావు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని రంగదాంపల్లిలో అమరులవీరుల స్థూపం దగ్గర అంజలి ఘటించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ నిర్వహిస్తున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో జరుగుతున్న దీక్షా దివస్‌ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే అనిల్‌ యాదవ్‌, జిల్లా బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి గంగాధర్‌ గౌడ్‌ పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ నిర్వహిస్తున్నారు. వరంగల్‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్బంగా త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Life und business coaching in wien – tobias judmaier, msc. Mcdonald’s vs burger king advertising : who’s better ?. Consolidated bank ghana achieves record gh¢1 billion revenue in q3 2024 biznesnetwork.