Headlines
raj

రాజ్ కుంద్రా నివాసాల్లో ఈడీ సోదాలు

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హాట్ షాట్స్ యాప్ ద్వారా పోర్న్ కంటెంట్ నిర్మాణం, ప్రసారం కేసులో మనీలాండరింగ్ అంశంపై ఈడీ విచారణ చేస్తోంది. రాజ్‌ కుంద్రా నివాసంతోపాటు కార్యాలయాల్లోనూ ఈడీ తనిఖీలు చేపడుతోంది. సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

ఔత్సాహిక న‌టీన‌టుల‌తో అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్ చేసిన కేసులో రాజ్‌ కుంద్రాను 2021 జూన్‌లో ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తలిసిందే. ముంబై పోలీసుశాఖ‌కు చెందిన ప్రాప‌ర్టీ సెల్.. పోర్న్ వీడియోలు చేస్తున్న ఓ ముఠాను ప‌ట్టుకోగా అప్పట్లో ఈ వ్యవహారం బయటపడింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల కోసం షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నామ‌న్న నెపంతో వాళ్లు పోర్న్ వీడియ‌లు తీస్తున్నట్లు గుర్తించారు. పోర్న్ వీడియోలు షూట్ చేసిన త‌ర్వాత‌.. వాటిని వీట్రాన్స్‌ఫ‌ర్ ద్వారా విదేశాల‌కు ఆ కామెంట్‌ను పంపిస్తారు.

అయితే భార‌తీయ చ‌ట్టాల నుంచి త‌ప్పించుకునేందుకు ఆ అశ్లీల చిత్రాల‌ను అక్కడి యాప్స్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ కేసును విచారిస్తున్న క్రైం బ్రాంచ్ పోలీసులకు ఈ విష‌యాలు తెలిశాయి. ఈ వ్యవహారంలో ఉమేశ్ కామత్ అనే వ్యక్తిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అత‌ను రాజ్‌కుంద్రా వ‌ద్ద ప‌నిచేసేవాడు. ఉమేశ్ కామ‌త్‌ను అరెస్టు చేసిన త‌ర్వాతే.. ఆ పోర్న్ రాకెట్‌లో కుంద్రా పాత్ర ఉన్నట్లు తేలింది. విచారణ అనంతరం ప‌క్కా ఆధారాలతో 2021 జులై 20న రాజ్‌ కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్దీ రోజులకు కుంద్రా విడుదలయ్యాడు.

రాజ్ కుంద్రా, అతని కంపెనీ పోర్నోగ్రాఫీ చిత్రాలను తీసి,వాటి ద్వారా భారీగా డబ్బును సంపాదించడమే కాకుండా,దేశంలోని చట్టాలను కూడా అధిగమించేందుకు ప్రయత్నించారు. 2021 ఫిబ్రవరి 4న ముంబై పోలీసులు ఈ క్రమంలో కేసు నమోదు చేశారు.ఈ పోర్న్ రాకెట్‌పై ముంబైలోని మల్వానీ పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. కొందరు అమ్మాయిలను అసభ్యకర చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేయడం,అందువల్ల ఈ అనేక సంఘటనలు బయటపడ్డాయి. ఈ క్రమంలో,మలాడ్ వెస్ట్ ప్రాంతంలో జరిగిన పోర్న్ చిత్రాల షూటింగ్ బంగ్లా పై దాడి చేసారు. ఈ దాడిలో ఒక బాలీవుడ్ నటి సహా 11 మందిని అరెస్టు చేశారు.ఈ కేసు ఇంకా విచారణలో ఉన్నది, అధికారుల చర్యలు తదుపరి జాగ్రత్తల కోసం కొనసాగుతున్నాయి. మరి ఇప్పుడు ఈడీ విచారణలో ఇంకేమైనా నిజాలు బయటపడతాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Indoor digital tv antenna hdtv hd aerial. Advantages of overseas domestic helper. Icomaker.