రెండు రోజులు వయనాడ్‌లో రాహుల్, ప్రియాంక పర్యటన

Rahul and Priyanka visit Wayanad for two days

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రెండు రోజులు (శని, ఆదివారం) వాయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉప ఎన్నికల్లో వాద్రా వాయనాడ్‌ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఓటర్లకు ఈ పర్యటనలో కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. వీరిద్దరూ శనివారం ఉదయం 11 గంటలకు కోజికోడ్ విమానాశ్రయంనకు చేరుకుంటారు.

కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి అసెంబ్లీ నియోజకవర్గంలోని మధ్యాహ్నం 12 గంటలకు ముక్కాంలో బహిరంగ సభకు హాజరుకానున్నారు. అనంతరం మలప్పురం జిల్లాలోని కరులై, వండూరు, ఎడవన్నలలో రిసెప్షన్ కార్యక్రమాలకు హాజరవుతారు. ఆదివారం వాయనాడ్‌ జిల్లాలోని మనంతవాడి, సుల్తాన్ బతేరి, కల్పేటలో జరిగే స్వాగత కార్యక్రమాలకు వాద్రా హాజరవుతారు. ఈ నేపథ్యంలో ఆమె కోజికోడ్‌ నుంచి ఢిల్లీకి పార్లమెంట్‌ సమావేశాల నిమిత్తం వెళ్లనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిటీ జనరల్‌ కన్వీనర్‌ ఎ.పి. అనిల్‌ కుమార్‌ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

మరోవైపు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎంపీగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ఆమె పార్లమెంట్‌కు హాజరయ్యారు. ప్రియాంక ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆమె పిల్లలు రైహాన్ వాద్రా, మిరయా వాద్రా హాజరై తల్లికి శుభాకాంక్షలు తెలిపారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించారు. తన చేతిలో ఉన్న రాజ్యాంగ పుస్తకం చూపిస్తూ ప్రియాంక ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రియాంకకు పలువురు అభినందనలు తెలిపారు. కేరళ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఆమె సభకు హాజరయ్యారు. ఎంపీ హోదాలో ప్రియాంక గాంధీ తొలిసారి లోక్ సభలోకి ప్రవేశించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రం చేసిన ఆమె.. మొదటి సారే భారీ విజయాన్ని అందుకున్నారు. ఇటీవల కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగగా.. 4 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో ఆమె భారీ విజయం సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Finding opportunity in a saturated market : how to thrive in the skincare and beauty industry biznesnetwork. Clínica de recuperação para dependentes químicos : quando é a hora certa ?. て?.