గేమ్ ఛేంజర్’ నుంచి ‘నానా హైరానా’ సాంగ్

gamechanger song

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ గురించి ఎప్పటినుంచో టాలీవుడ్ ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటాయి. దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్బంగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. చరణ్ మరియు కియారా అద్వానీ జోడీ ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా, శంకర్ వీరి రొమాంటిక్ కెమిస్ట్రీని ఎలా అద్భుతంగా తెరపై ఆవిష్కరిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువగా ఉంది.

ఈ చిత్రంలోని తొలి పాట ‘నా నా హైరానా’ (తెలుగులో), హిందీలో ‘జానా హైరాన్ సా,’ తమిళంలో ‘లై రానా’ అంటూ విడుదలై ప్రేక్షకులను మాయలోకి తీసుకెళ్లింది. అందమైన సంగీతంతో మెలోడీ ఆఫ్ ది ఇయర్‌గా నిలుస్తోన్న ఈ పాటకు తెలుగు వెర్షన్‌ను రామజోగయ్య శాస్త్రి రాయగా, హిందీ కోసం కౌసర్ మునీర్, తమిళం కోసం వివేక్ లిరిక్స్ అందించారు. ఈ పాటకు సంబంధించిన బీటీఎస్ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

దర్శకుడు శంకర్ తన దృష్టి, ప్రతిభను మరోసారి చాటుకుంటూ ‘నా నా హైరానా’ పాటను ఒక చిత్రకావ్యంలా మలిచారు. న్యూజిలాండ్‌లో చిత్రీకరించిన ఈ సాంగ్‌లో ప్రతి ఫ్రేమ్ కళాత్మకతకు పరాకాష్టగా కనిపిస్తుంది. ముఖ్యంగా ‘రెడ్ ఇన్‌ఫ్రా’ కెమెరా టెక్నాలజీని ఉపయోగించడం వల్ల విజువల్స్ మరింత ఆకర్షణీయంగా మారాయి. ప్రతి సన్నివేశం ఒక పైన్టింగ్‌లా మసులుకుంటూ ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తుంది. సంగీత దర్శకుడు తమన్ ఈ పాటను ఫ్యూజన్ మెలోడీ గా ట్యూన్ చేయగా, ప్రముఖ గాయకులు శ్రేయా ఘోషాల్ మరియు కార్తీక్ తమ వాయిస్‌తో పాటకు ప్రాణం పోశారు.

డాన్స్ మూమెంట్స్‌కు నృత్య దర్శకుడు స్కో మార్టిస్ హై స్టాండర్డ్ కొరియోగ్రఫీ అందించారు. సరిగమా మ్యూజిక్ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలోని ఈ పాట ఇప్పటికే ఆడియెన్స్ మతిపోగొడుతుంది.‘గేమ్ ఛేంజర్’ చిత్రంపై అభిమానుల్లో ఉత్సాహం ఏ స్థాయిలో ఉందో ఈ పాట విడుదలతో మరింత స్పష్టమైంది. చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రానికి కియారా అద్వానీ సొగసు, శంకర్ మేకింగ్ స్టైల్, తమన్ సంగీతం మూడూ కలగలిపి భారీ విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘గేమ్ ఛేంజర్’ మరో సారి రామ్ చరణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని టాలీవుడ్ వర్గాలు ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

He had nо іntеrеѕt іn the еxіѕtіng rulеѕ оf thе gаmе. Life und business coaching in wien – tobias judmaier, msc. Retirement from test cricket.