ఏపీ హైకోర్టులో రామ్‌గోపాల్‌ వర్మ మరో పిటిషన్ !

Another petition of Ram Gopal Varma in AP High Court

అమరావతి: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని రామ్‌గోపాల్‌ వర్మ పిటిషన్ వేశారు. చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెడుతున్నారని ఆర్జీవీ పిటిషన్ వేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు.

ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని రామ్‌గోపాల్‌ వర్మ పిటిషన్ వేశారు. ఇప్పటి వరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని ఆర్జీవీ పిటిషన్ వేయడం జరిగింది. ఇక నేడు రామ్‌గోపాల్‌ వర్మ వేసిన పిటిషన్‌పై విచారించనున్న ఏపీ హైకోర్టు… ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి. అటు జైల్లో వేసినా కూడా తాను భయపడను అంటూ వర్మ కామెంట్స్ చేశారు.

కాగా, రామ్‌గోపాల్‌వర్మ(ఆర్జీవీ) అజ్ఞాతంలో ఉండి వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. తనకు ఎలాంటి భయం లేదని చెబుతూ.. తనపై ఫిర్యాదు చేసిన వారికి ఏమాత్రం అర్హత లేదని ఆయన అందులో స్పష్టం చేశారు. పోలీసు విచారణకు సహకరిస్తానని చెప్పి.. తప్పించుకుని తిరుగుతున్న ఆయన వీడియోలో వివరణ ఇవ్వడం చర్చనీయాంశమైంది. సోషల్‌ మీడియాలో పెట్టిన అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో తనపై నమోదైన కేసులో రెండుసార్లు ఆయన విచారణకు గైర్హాజరైన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. India vs west indies 2023. On james webb telescope – new generation telescope.