చంద్రబాబు జైలులో ఉన్నాడని .. ఒక టూరిస్టులాగా ఫొటో తీసుకున్నా – వర్మ

varma rajamandri

డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తన సినిమాలతోనే కాకుండా మీడియా, సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే ఇందులో రాజకీయ నాయకులపై చేసే కామెంట్లు, పోస్టులతో పార్టీల కార్యకర్తలతో ప్రశంసలు, విమర్శలు పొందుతూనే ఉంటారు. ఇక టీడీపీ విషయంలో మరీ ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్‌లపై ట్వీట్లు, కామెంట్లతో తనదైన శైలిలో ఆర్జీవీ విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. గత ఏడాది చంద్రబాబు ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచిప్పుడు జైలు బయట నిలుచుని వర్మ సెల్ఫీ తీసుకున్న పిక్ అప్పడు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

తాజాగా దీనిపై వర్మ క్లారిటీ ఇచ్చారు. “చంద్రబాబు జైల్లో ఉన్నాడని అందరికీ తెలిసింది. నేను ఒక టూరిస్టుగా వెళ్లి, జైలు ఎదుట ఫొటో తీసుకున్నాను. ఇది అలసట, హేళన కాదు. జైలుకు వెళ్లినప్పుడు గాంధీ, హిట్లర్ లేదా జగన్ ఉన్నా, నేను అదే విధంగా వ్యవహరించేవాడిని” అని పేర్కొన్నారు. ఇందులో ఇలాంటి వివాదం, హేళన లేదని . మామూలుగానే తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వర్మ ఫై ఏపీలో వరుసగా కేసులునమోదైన సంగతి తెలిసిందే. జగన్ అండ చూసుకొని గతం లో చంద్రబాబు , నారా లోకేష్ , పవన్ కళ్యాణ్ ఫై చేసిన వాక్యాలు, పెట్టిన పోస్టుల ఫై వరుసగా కేసులు పెట్టడం తో..పోలీసులు వర్మ కోసం గాలింపు చేస్తున్నారు. అయన మాత్రం షూటింగ్ ల పేరుతో పోలిసుల విచారణ కు హాజరుకాకుండా తిరుగుతున్నాడు. కానీ సోషల్ మీడియా లో మాత్రం ఎప్పటిలాగానే యాక్టివ్ గా ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Read more about un реасеkеереrѕ іn lebanon ѕау iѕrаеl hаѕ fіrеd on thеіr bаѕеѕ deliberately. Latest sport news. Bring the outside in : 10 colorful indoor plants to add a pop of joy brilliant hub.