42 summer special trains from Visakhapatnam !

Visakhapatnam : విశాఖ నుంచి 42 వేసవి ప్రత్యేక రైళ్లు !

Visakhapatnam : వేసవి సెలవులు మొదలు కానున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు ఇక బ్రేక్ పడనుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరూ పరీక్షల మూడ్ నుంచి ఎంజాయ్ మూడ్‌లోకి వచ్చేస్తున్నారు. వేసవి సెలవుల్లో ఎటు వెళ్లాలనే దానిపై ఇప్పటికే చాలా మంది టూర్లు కూడా ప్లాన్ చేసుకుని ఉంటారు. కొంతమంది ఆధ్యాత్మిక క్షేత్రాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తే.. మరికొంతమంది విహారయాత్రలు, వినోద యాత్రలు ప్లాన్ చేస్తుంటారు. దీంతో వేసవి సెలవుల్లో రైల్వేస్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడనున్నాయి. ఈ నేపథ్యంలో వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఇప్పటికే తిరుపతికి ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. ఇప్పుడు విశాఖపట్నానికి 42 ప్రత్యేక రైళ్లు నడపనుంది.

Advertisements
విశాఖ నుంచి 42 వేసవి ప్రత్యేక

ప్రయాణికుల రద్దీని దృష్టి ప్రత్యేక రైళ్లు

వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపడానికి సిద్ధమైంది. విశాఖపట్నం-బెంగళూరు, విశాఖపట్నం-తిరుపతి, విశాఖపట్నం-కర్నూలు మధ్య మొత్తం 42 ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 13 నుంచి మే నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వీక్లీ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు 14 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. 08581 నంబర్‌తో విశాఖపట్నం నుంచి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ప్రత్యేకరైలు బెంగళూరుకు బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు 12 గంటల 45 నిమిషాలకు బెంగళూరు చేరుకుంటుంది.

Read Also : జమిలి ఎన్నికలతో ఎన్నికల ఖర్చు ఆదా : వెంకయ్య నాయుడు

Related Posts
YS Vivekananda: మా నాన్న కేసులో సాక్షులు చనిపోవడం అనుమానాస్పదమే : సునీత
deaths of witnesses in my father case are suspicious: Sunitha

YS Vivekananda : వైఎస్‌ వివేకా కేసులో ఉన్న సాక్షులు చనిపోవడంపై వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్న కేసులో Read more

AP Govt : ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి – జగన్
కూటమిపై జగన్ హెక్కుపెట్టిన విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల సంక్షేమమే తమ ముఖ్య లక్ష్యమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. కడప జిల్లాలో లింగాల ప్రాంతాన్ని సందర్శించిన ఆయన, ఇటీవల నష్టపోయిన Read more

కౌశిక్ రెడ్డి అరెస్టు దారుణం: కెటిఆర్
కౌశిక్ రెడ్డి అరెస్టు దారుణం కెటిఆర్

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఖండించారు. తప్పుడు కేసులు పెట్టడం, బీఆర్ఎస్ నాయకులను తరచుగా అరెస్టు చేయడం Read more

Super Fast Express: ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ నుండి విడిపోయిన భోగీలు
Super Fast Express: ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ నుండి విడిపోయిన భోగీలు

శ్రీకాకుళం జిల్లాలో ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది పలాస సమీపంలో బోగీలు విడిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెద్ద ప్రమాదం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×