వర్మపై ఒకటి , రెండు కాదు ఏకంగా 9 కేసుల నమోదు

varma

సినీ డైరెక్టర్ , వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి , రెండు కాదు ఏకంగా 09 కేసులు నమోదు అయ్యాయి. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌పై అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలపై ఆయనపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలీసులు ఆర్జీవీకి రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే, విచారణకు సహకరించలేదని ఆరోపణలు ఉన్నాయి.

మొన్న ఉదయం పోలీస్ బృందం ఆర్జీవీ ఇంటికి చేరుకుని విచారణ ప్రక్రియను కొనసాగించేందుకు ప్రయత్నించింది. ఆయన సహకరించకపోతే వెంటనే అరెస్టు చేసి ఒంగోలుకు తరలించనున్నట్లు సమాచారం. ఆయన నోటీసులకు గడువు కావాలని ఇప్పటికే పోలీసులు దగ్గర మరింత సమయం కోరారు. వర్మ కోసం 6 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళలో పోలీసులు గాలిస్తున్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని నిన్న ఒక వీడియోను వర్మ విడుదల చేశారు.

తాజాగా రామ్ గోపాల్ వర్మ దీనిపై ఓ వీడియో విడుదల చేశారు. పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదని, వణికిపోవడం లేదని చెప్పారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట అంటూ మళ్లీ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. తాను పోస్టు పెట్టిన వారికి కాకుండా.. ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయన్నారు. సినిమా పనిలో ఉండడం వల్ల స్పందించడం కుదరలేదని, తనకు వచ్చిన నోటీసులకు తాను సమాధానం ఇచ్చానని రామ్ గోపాల్ వర్మ గోపాల్ వర్మ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Happy gifting, and may your office holiday party be filled with joy, laughter, and a touch of holiday magic !. Por fim, o acompanhamento contínuo é uma estratégia essencial para prevenir recaídas. 禁!.