చీరలు కట్టుకొని బస్సు ఎక్కి దివ్యాంగుల నిరసన

free bus scheme effect inno

ఆర్టీసీ బస్సుల్లో తమకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ (D) వర్ధన్నపేటలో కొందరు దివ్యాంగులు చీరలు కట్టుకొని బస్ ఎక్కి నిరసన తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తాము నిత్యం ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమకు బస్సుల్లో ఉన్న ఒక సీటుతో పాటు అదనంగా మరో 2 సీట్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం దివ్యాంగులకు శాపంగా మారుతున్నదన్నారు. ఉచిత ప్రయాణంతో దివ్యాంగులకు బస్సుల్లో సీట్లు దొరకడంలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మహిళలు తమకు సంబంధించిన సీట్లలో కూర్చోవడంతో దివ్యాంగులకు సీట్లు దొరక్క‌ ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బస్సుల్లో దివ్యాంగులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌ షరీఫ్‌, రాష్ట్ర బాధ్యులు కొల్లూరి ఈదయ్య, గుడిపెల్లి సుమతి, జెట్టబోయిన శ్రీనివాస్‌, ఇస్లావత్‌ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల ఉపయోగం ఉంటుందని అంత భైవించారు కానీ ఉపయోగం కంటే వృధానే ఎక్కువగా ఉంది. ఎక్కడ చూడు ఫ్రీ అని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తున్నారు. అవసరం ఉన్న లేకపోయినా బస్సు ప్రయాణాలు చేయడం వల్ల మగవారికి ఇబ్బందిగా మారింది. ఎక్కడ కూడా సీట్లు దొరకని పరిస్థితి. గంటల కొద్దీ ప్రయాణం నిల్చువాల్సి వస్తుందని వారంతా ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. తమకు కూడా ప్రత్యేక బస్సు లను అందుబాటులోకి తీసుకరావాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Happy gifting, and may your office holiday party be filled with joy, laughter, and a touch of holiday magic !. Construindo uma vida equilibrada após o tratamento : clínica de recuperação liberdade e vida para dependentes químicos. ??.