మధ్యాహ్న భోజనం కాదు బేకరీ ఫుడ్ వల్లే అస్వస్థత – మాగనూర్ ఘటన పై కలెక్టర్ క్లారిటీ

food poison in maganoor

తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ప్రభుత్వ హాస్టల్స్ లలో , గురుకుల ఆశ్రమంలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట ఫుడ్‌ పాయిజన్‌ ఘటన అనేది వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా నారాయణపేట జిల్లా, మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనం మరోసారి వికటించింది. ఫలితంగా 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పాఠశాలలో 400 మంది విద్యార్థులు భోజనం చేయ గా అందులో 40 మంది అస్వస్ధతకు గురయ్యారు.

వీరిని ఉపాధ్యాయులు వెంటనే స్థా నిక పిహెచ్‌సికి తరలించారు. 27 మందికి ప్రథ మ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మక్తల్ ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. నేత్ర అనే తొమ్మిదవ తరగతి విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. మిగతా 26 మందికి మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మాగనూర్‌లో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గత నెల 20న ఇలాంటి ఘటనే జరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారం రోజులుగా వారి సమక్షంలోనే విద్యార్థులకు వండిపెడుతున్నారు. తహసీల్దార్‌ సురేశ్‌ పర్యవేక్షణలో ప్రతి రోజూ దగ్గరుండి వడ్డిస్తున్నారు.

మంగళవారం ఇలానే వడ్డించారు. విద్యార్థులు ఒంటిగంటకు భోజనం చేయగా, మధ్యాహ్నం 3:30 గంటలకు తరగతి గదిలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి అంటూ ఏడుస్తూ బయటకు పరుగులు తీశారు. ఉపాధ్యాయుల ముందే వాంతులు చేసుకున్నారు. ఈ ఘటన పై కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పందించారు. మధ్యాహ్న భోజనానికి ముందు 22 మంది విద్యార్థులు బేకరీలు, దుకాణాల్లో తినుబండారాలు తిన్నారని తెలిపారు. మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురి కాలేదన్నారు. వివిధ ప్రాంతాల నుండి పాఠశాలకు వచ్చే విద్యార్ధులు పాఠశాల సమీపంలోని 14 చోట్ల ఉన్న దుకాణాలు, బేకరీలలో తినుబండారాలు తి న్నం దు వల్లే భోజన అనంతరం ఆ విద్యార్ధులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు.

పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నుంచి విద్యార్ధులు అస్వస్థతకు గురి కాలేదని అధికారుల విచారణలో తెలిసిందని కలెక్టర్ తెలిపారు. గతవారం ప్రతి హాస్టల్, రెసిడెన్సియల్ సంస్థలను కలెక్టర్, అదనపు కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, ఆర్‌డిఓలు సందర్శించినట్లు తెలిపారు. పాత బియ్యం బస్తాలన్నీ మార్చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు పాఠశాలలను సందర్శించి తనిఖీ చేసి స్టాకులను ధృవీకరించాలని తెలిపారు. పలు పాఠశాలల్లో నోటీసులు అందజేసి చర్యలు తీసుకునట్లు కలెక్టర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

That is their strength compared to other consulting companies. 15 side hustles to make extra money online proven. Consolidated bank ghana achieves record gh¢1 billion revenue in q3 2024 biznesnetwork.