బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు..దుర్మార్గమైన చర్య: హరీశ్‌ రావు

Early arrest of BRS leaders.evil acts. Harish Rao

హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పెరిగిపోతున్నాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తారు. ఈ క్రమంలోనే మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు, బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు చేసి పీఎస్‌కు తరలించడం దుర్మార్గమైన చర్య అని..దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

పురుగుల అన్నం మాకొద్దు అని విద్యార్థులు రోడ్డెక్కి నినదిస్తుంటే చీమ కుట్టినట్లైనా లేదా? విద్యార్ధులకు మంచి భోజనం కూడా పెట్టలేని దీనస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా? అని నిలదీశారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న మాగనూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించడానికి వెళ్తారనే నెపంతో బీఆరెఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేశారని.. పాఠశాలలు సందర్శించడానికి వెళ్తే ప్రభుత్వానికి ఎందుకు అంత భయమని ‘ఎక్స్’ వేదికగా హరీశ్‌ రావు ప్రశ్నించారు.

ఫుడ్ పాయిజన్ వల్ల ఆస్పత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను విడనాడాలని, అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యేతో పాటు, బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు .సీఎం రేవంత్ ప్రతిపక్షాల గొంతు నొక్కడం సరికొదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Öffnungszeiten der coaching & mediations praxis – tobias judmaier msc. Retirement from test cricket.