అదానీ అంశంపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan responded to Adani's issue

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అదానీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖా మంత్రి భూపేంద్ర యాదవ్ తో పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… గత ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని… అదానీ సోలార్ ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారని తెలిపారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింస చాలా బాధాకరం. తీవ్ర ఆవేదన చెందుతున్నామని… బంగ్లాదేశ్ ఏర్పడిందే భారత సైన్యం త్యాగాలతో అన్నారు. భారత్ లో మైనార్టీలను ఎలా చూస్తున్నాం, అక్కడ మైనార్టీ హిందువులను ఎలా చూస్తున్నారు? అని ఆగ్రహించారు.

పాలస్తీనా లో ఏదైనా జరిగితే స్పందించే ప్రముఖులు, బంగ్లాదేశ్ లో జరిగే అంశాలపై ఎందుకు స్పందించరు అంటూ ప్రశ్నించారు. ₹110 కోట్ల ఎర్ర చందనం దుంగలను కర్ణాటకలో దొరికితే, వాటిని ఆ రాష్ట్రం అమ్మేసిందని… అదే ఎర్ర చందనం ఇతర దేశాల్లో దొరికితే తిరిగి తెప్పించుకోవచ్చు అన్నారు. నేపాల్ నుంచి కూడా అలాగే రప్పించామని…విదేశాల విషయంలో ట్రీటీ ఉన్నట్టు పొరుగు రాష్ట్రాల్లో దొరికినప్పుడు ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికి చేరవేసే విధానం లేదని వివరించారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి తో మాట్లాడాను. సొంత రాష్ట్రానికి అప్పగించేలా చర్యలు చేపట్టాలని కోరానని వివరించారు. అదానీ పవర్ విషయంలో లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి… ఈ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగింది అన్నది తెలుసుకోవాల్సి ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The technical storage or access that is used exclusively for statistical purposes. : hvis du ser andre tegn som hoste, vejrtrækningsproblemer eller sløvhed, skal du meddele dette til dyrlægen. Navigating health savings accounts (hsas) : your guide to smart healthcare saving.