నేడు ప్రధాని మోడీతో సమావేశం కానున్న పవన్‌ కల్యాణ్

BJP protests in Telangana from 30th of this month 1

న్యూఢిల్లీ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతుంది. నిన్న వరుసగా పలువురు కేంద్ర మంత్రులు, ఉప రాష్ట్రపతితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈరోజు (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించనున్నారు. జల్ జీవన్ మిషన్ స్కీమ్‌లో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేయనున్నారు.

పవన్ అభ్యర్ధనల పైన కేంద్ర మంత్రులు వెంటనే స్పందించి ఆమోదం తెలుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ప్రధానితో భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. హర్యానాలో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సమయంలో ప్రధానిని పవన్ కలిసారు. ఆ తరువాత ఇప్పుడు పవన్ భేటీ కానున్నారు.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు.. కేంద్రం జమిలి దిశగా అడుగులు వేస్తున్న వేళ వ్యూహాత్మకంగా నే ఈ భేటీ ఖరారు అయినట్లు తెలుస్తోంది. పవన్ ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం ఇవ్వటం ద్వారా రానున్న రోజుల్లో పవన్ సేవలను ఎన్డీఏ బలోపేతానికి వినియోగించుకోవాలనేది బీజేపీ వ్యూహం గా స్పష్టం అవుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్ధులకు మద్దతుగా పవన్ ప్రచారం చేసారు. ఆ సమయంలో వచ్చిన స్పందన పైన బీజేపీ ముఖ్య నేతలు ఆరా తీసారు. ప్రధాని మోడీ పైన పవన్ పలు సందర్భాల్లో విధేయత చాటుకున్నారు. ఇక..డిప్యూటీ సీఎం అయిన తరువాత ఆ హోదాలో ప్రధానితో ఒన్ టు ఒన్ సమావేశం కావటం ఇదే తొలి సారి. పవన్ ను దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రచార కర్తగా వినియోగించుకోవాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. Gаrmаn асknоwlеdgеѕ thаt hе іѕ аt odds with the board mаjоrіtу. (philippine coast guard via ap).