విడాకులు తీసుకున్న అమ్మాయికి సమాజం రకరకాల ట్యాగ్‌లు వేస్తారంటూ ?????

samantha 3

టాలీవుడ్ స్టార్ నటి సమంత ప్రస్తుతం తన జీవితంలో వివిధ దశలను అధిగమిస్తూ కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. విడాకులు, ఆరోగ్య సమస్యలు వంటి సమస్యల మధ్య ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగత అనుభవాలపై, సమాజం తన వంటి మహిళలపై చూపే ఆలోచనలపై ఆసక్తికరమైన అభిప్రాయాలను పంచుకుంది. సమంత మాట్లాడుతూ, “ఇద్దరి బంధం విరగిపోతే, తప్పు ఎక్కువగా మహిళలకే వాపారించడం సాంప్రదాయ సమాజపు రివాజుగా మారింది” అని పేర్కొన్నారు. విడాకులు తీసుకున్న మహిళలను “సెకండ్ హ్యాండ్,” “యూజ్డ్” వంటి మాటలతో బాధపెట్టడం దారుణమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలు వారి జీవితాలను మిగిలిన సమాజానికి వ్యతిరేకంగా మలుస్తాయని ఆమె చెప్పింది.

సమాజం ఈ విధమైన ముద్రలను ఎందుకు వేస్తుందో అర్థం కాకపోవడం తనకు బాధ కలిగించిందని వివరించింది.మయోసైటిస్ వంటి ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని నెలలు వెనుకబడి, చివరికి సినిమాలతో మళ్లీ తెరపైకి వచ్చిన సమంత ఇప్పుడు కొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతోంది.”సిటాడెల్” అనే వెబ్ సిరీస్‌లో నటించిన ఆమె, ఆ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ సందర్భాల్లో తన జీవితంలోని కఠిన దశల గురించి చర్చిస్తూ, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు తనకు అందించిన మద్దతుపై కృతజ్ఞతలు తెలియజేశారు.

తన పెళ్లి గౌను రీ-మోడలింగ్ చేయడం గురించి మాట్లాడుతూ, ఆ సమయంలో ఆమె భావోద్వేగాలను కూడా పంచుకున్నారు. గౌను మార్చడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని తాను ఎప్పుడూ అనుకోలేదని స్పష్టం చేశారు. ఆమె అభిప్రాయం ప్రకారం, జీవితంలో ఎదిగిన ప్రతీ దశకు మన బలం ఆధారమే. కష్టకాలంలో తనకు బలం అందించిన వారి గురించి మాట్లాడటం తనకు సంతోషాన్ని ఇచ్చిందని చెప్పింది.

ప్రస్తుతం తన జీవితంలో కొత్త ఆరంభానికి సంతోషంగా ఉన్నానని సమంత పేర్కొన్నారు. ఇకపోతే, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల సంబంధం చర్చనీయాంశమవుతున్న వేళ, సమంత చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్‌గా మారాయి. ఆమె మాటలు ఆమె నమ్మకాన్ని, జీవితం పట్ల ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ సమంత తన కెరీర్‌లో ముందుకు సాగడం ఒక ప్రత్యేకత. ఆమె ధైర్యం, ఆత్మవిశ్వాసం యువతకు ఒక స్ఫూర్తి అని చెప్పడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Tips for choosing the perfect secret santa gift. Nossa clínica possue um elevado padrão de qualidade no tratamento de pessoas com dependência química e saúde e mental. 「散歩のとき何か食べたくなって」タグ一覧 | cinemagene.