పొడి దగ్గు (డ్రై కాఫ్) అనేది శరీరానికి చాలా ఇబ్బందిని కలిగించే ఒక సమస్య. ఇది తరచుగా గొంతులో పొడిబారిన, ఇన్‌ఫ్లమేషన్ కారణంగా ఏర్పడుతుంది. అయితే ఈ సమస్యను తగ్గించే సహజ చికిత్సలు ఉన్నాయి.
తేనే ఒక ఉత్తమ సహజ ఔషధం.తేనేలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు గొంతులోని ఇరిటేషన్‌ను తగ్గించి, దగ్గును నిదానంగా తగ్గించడంలో సహాయపడతాయి.రాత్రి సమయాల్లో, ఒక టీస్పూన్ తేనే తీసుకోవడం ద్వారా వర్షాకాలంలో లేదా చల్లని వాతావరణంలో కలిగే పొడి దగ్గు నివారించవచ్చు.
ఇంకొక అద్భుతమైన ఔషధం నెయ్యి మరియు నల్ల మిరియాలు మిశ్రమం.నెయ్యి గొంతు అలర్జీని తగ్గించి, నల్ల మిరియాలు పొడి దగ్గు కారణంగా గొంతులో ఇబ్బంది ఏర్పడకుండా నిలిపివేస్తాయి. సగం చెంచా నెయ్యిలో చిటికెడు నల్ల మిరియాలు పొడి కలిపి తీసుకోవడం చాలా ప్రయోజనకరం. రోజుకు రెండు సార్లు తీసుకుంటే, పొడి దగ్గు సులభంగా తగ్గుతుంది.
అల్లం కూడా ఒక మంచి పరిష్కారం. దీనిలో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి గొంతు నొప్పిని తగ్గించడానికి మరియు శరీరాన్ని శక్తివంతం చేయడానికి సహాయపడతాయి.అల్లం చాయ తాగడం ద్వారా ఈ సమస్యకు చాలా సహాయం అందుతుంది. అల్లం ముక్కలు వేడి నీళ్లలో ఉంచి, కొన్ని నిమిషాల పాటు ఉంచి తీసుకోవచ్చు. ఈ టీలో తేనే కలపడం పొడి దగ్గు తగ్గించడంలో మరింత ప్రయోజనకరం.పసుపు కూడా గొంతు సమస్యలకు ఉపకరించగలిగే ఒక బలమైన సహజ ఔషధం. పసుపును నల్ల మిరియాల పొడితో కలిపి తీసుకోవడం ద్వారా దాని ప్రభావాన్ని మరింత పెంచవచ్చు.ఈ సహజ చికిత్సలు పొడి దగ్గుని తగ్గించి గొంతుకు ఉపశమనం అందిస్తాయి.