ముంబయి 26/11 మారణ హోమానికి 16 ఏళ్లు..

16 years

మంబయి: దేశ ఆర్థిక రాజధానిలో మారణ హోమానికి 16 ఏళ్లు. 2008 నవంబర్ 26న సముద్రమార్గం ద్వారా మంబయిలోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదులు తాజ్ హోటల్, CSMT, ట్రైడెంట్ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లతో పాటు కాల్పులకు తెగబడ్డారు. 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 300 మంది గాయపడ్డారు. భద్రతా బలగాల కాల్పుల్లో 9 మంది దుండగులు చనిపోగా, ఉగ్రవాది కసబ్ సజీవంగా పట్టుబడ్డాడు. అతడిని 2012 నవంబర్ 21న ఉరితీశారు.

కాగా, 26/11 ఘటనను దేశపౌరులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఆ రోజు ఉగ్రవాదులు చేసిన దారుణం అంతా ఇంతా కాదు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఏకంగా 170మందిని పొట్టన బెట్టుకున్నారు. వారి దెబ్బకు ముంబయి నగరం విలవిల్లాడిపోయింది. 26 నవంబర్, 2008న ఉదయం ముంబయి ప్రజలు ఎప్పటిలాగానే తమ రోజును ప్రారంభించారు. అయితే ఆ రోజు రాత్రి ఉగ్రవాదులు పెను బీభత్సం సృష్టిస్తారని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఆ రోజు సాయంత్రం ఓ భారతీయ పడవను హైజాక్ చేసిన 10మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు.. పడవలోని వారిని దారుణంగా చంపేశారు.

అనంతరం ముంబయి తీరంలోని కొలాబా సముద్ర మార్గం ద్వారా దేశంలోని అక్రమంగా ప్రవేశించారు. బృందాలుగా విడిపోయిన వారంతా దేశ ఆర్ధిక రాజధానిలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నారు. అనంతరం స్టార్ హోటళ్లు, హాస్పిటల్, రైల్వేస్టేషన్ లక్ష్యంగా ఏకకాలంలో దాడులకు తెగబడ్డారు. బృందాలుగా విడిపోయిన ఉగ్రవాదులు ముందుగా ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినల్‌లో రద్దీగా ఉన్న రైల్వేస్టేషన్‌‌కు చేరుకున్నారు. స్టేషన్ లోపలికి వెళ్లిన ముష్కరులు వెంట తెచ్చుకున్న ఏకే-47 తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. దేశ ప్రజలపై బుల్లెట్ల వర్షం కురిపించారు. కళ్లు మూసి తెరిచే లోపే ప్రజలు పిట్టలా రాలిపోయారు. తుపాకుల మోతతో పలువురు పరుగులు పెట్టారు. ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు.

రైల్వేస్టేషన్‌లో జరిగిన దాడిలో 58 మంది సాధారణ పౌరుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో ఒక్కసారిగా ముంబయి నగరం ఉలిక్కిపడింది. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ముష్కరులు నగర వీధుల్లో రెచ్చిపోయారు. కనిపించిన వారినల్లా కాల్చివేశారు. అనంతరం తాజ్‌ హోటల్, లియోపోల్డ్‌ కేఫ్‌, కామా హాస్పిటల్‌, ఒబెరాయ్‌ ట్రైడెంట్‌, నారిమన్‌ లైట్‌ హౌస్‌ ప్రాంతాల్లో మారణహోమం సృష్టించారు. మెుత్తం 12 చోట్ల బాంబులు, తుపాకులతో విధ్వంసానికి పాల్పడ్డారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు మెుదలుపెట్టాయి. ముష్కరులకు ధీటుగా సమాధానం చెప్పాయి. దాదాపు 60 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి 10మందిలో 9మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అజ్మల్ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Safaricom’s half year profits dip amid ethiopian currency woes, increased capex. Prevenção de recaídas na dependência química : dicas da clínica de recuperação para dependentes químicos liberdade e vida. ?さな?.