ఆర్.కృష్ణయ్య కొత్త పార్టీ..?

r krishnaiah new party

పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, జనగణనలో కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన బీసీల సమరభేరి మహాసభలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలందరికీ సమాన వాటా ఉండాలని అన్నారు. బీసీల రాజ్యాధికారం కోసం అవసరమైతే పొలిటికల్ పార్టీ పెట్టేందుకు సిద్ధం అవుతామని స్పష్టం చేసారు.

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి వారికి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనగణనతోపాటు కులగణనా చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీలంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారం వైపు అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. సోమవారం రవీంద్రభారతిలో బీసీల సమరభేరి మహాసభ జరిగింది. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో బీసీలందరికీ సమాన వాటా లభించాలని, బీసీల రాజ్యాధికారం కోసం అవసరమైతే రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతామన్నారు.

కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి పాటుపడాలని ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం అమలు చేసే బీసీ రిజర్వేషన్లను 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

An electric vehicle battery fire is a serious incident that requires professional attention. Gcb bank limited. Life und business coaching in wien – tobias judmaier, msc.