మహబూబాబాద్ మహాధర్నాకు బయలుదేరిన కేటీఆర్

KTR left for Mahabubabad Mahadharna

హైదరాబాద్‌: మానుకోట గిరిజన మహాధర్నాలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్డు మార్గంలో మహబూబాబాద్ బయలుదేరారు. రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సోమవారం గిరిజన మహాధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహాధర్నాలో పాల్గొనేందుకు రోడ్డు మార్గంలో మహబూబాబాద్ బయలుదేరారు. దీంతో కేటీఆర్‌కు చిట్యాల వద్ద ఘనస్వాగతం లభించింది. ఆయనకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, నకేరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇతర మాజీ ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు.

ఆయన కారు విండో వద్ద స్టాండింగ్‌‌లో ఉండి కేడర్‌కు కరచాలనం చేశారు. కొడంగల్‌లోని లగచర్లలో గిరిజన రైతులపై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ మహాధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ధర్నా ద్వారా గిరిజనులకు భరోసా కల్పించి వారికి దగ్గర అయ్యేందుకు బీఆర్ఎస్ యత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మహాధర్నా వేదికగా రేవంత్ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీస్తారని సమాచారం.

కాగా, బీఆర్‌ఎస్‌ నేతలు హైకోర్టును ఆశ్రయించి ఈనెల 25న మహా ధర్నా నిర్వహించేందుకు అనుమతి పొందారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరుకానుండటంతో బీఆర్‌ఎస్‌ నాయకులు మానుకోటలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన, దళితులు, రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్ దర్నాకు పిలుపిచ్చింది. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. షరతులతో కూడిన దర్నాకు అనుమతినిచ్చింది. దీంతో కేటీఆర్ హైదరాబాద్ నుంచి మరి కాసేపట్లో మహబూబాబాద్‌కు బయలుదేరనున్నారు. మహా ధర్నా జరగనున్న నేపథ్యంలో ఫ్లెక్సీల రగడ జరుగుతోంది. కేటీఆర్ ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు చింపిన వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Clothing j alexander martin. New business ideas. Happy gifting, and may your office holiday party be filled with joy, laughter, and a touch of holiday magic !.