ఈ సంద‌ర్భంగా తమ్ముడిపై ప్రేమ‌ను కురిపిస్తూ వైష్ణ‌వి ఇన్‌స్టా పోస్టు

maxresdefault

‘బేబీ’ సినిమా ఘన విజయంతో వైష్ణవి చైతన్య ఒక్కసారిగా తెలుగు చిత్రసీమలో సూపర్‌హిట్ హీరోయిన్‌గా మారిపోయారు. మునుపు చిన్న పాత్రల్లో కనిపించిన ఆమెకు ఈ చిత్రం బ్రేక్‌ తేచింది. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో పాటు, వరుస ప్రాజెక్ట్‌లతో ఇప్పుడు బిజీ అవుతున్నారు.వైష్ణవి చైతన్య సోదరుడు నితీశ్ పుట్టినరోజు సందర్భంగా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపూరితమైన సందేశం పోస్ట్ చేశారు.”ప్రపంచంలోనే అత్యద్భుతమైన తమ్ముడికి హ్యాపీ బర్త్‌డే ” అంటూ ప్రారంభమైన ఈ పోస్ట్‌లో, నితీశ్ తమ కుటుంబంలో ఎంత ముఖ్యమైనవాడో ఆమె వివరించారు.”నీవు నన్ను ప్రతిరోజూ నవ్వుతూ ఉండేలా చూసుకుంటావు.నాకు ప్రతి ఉదయం ఆశతో ప్రారంభం అవుతుందంటే అది నీ వల్లనే. నీవు నా ప్రేమ, శ్రద్ధ, ఆనందానికి మూలం,” అంటూ ఆమె అన్నీ అనుభూతులతో వ్యక్తం చేశారు.

ఈ పోస్ట్‌లో వైష్ణవి, తన తమ్ముడితో ఉన్న బంధాన్ని అనుభూతులన్నీ వ్యక్తపరిచారు. “నీవు కేవలం నా తమ్ముడివే కాదు. నువ్వు నా రాక్‌స్టార్‌, నా బెస్ట్ ఫ్రెండ్‌. నీ కలలు నా కలలు. నీకు అవసరమైన దేనికైనా నేను ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటాను,” అంటూ తమ్ముడిపై చూపే ప్రేమను వర్ణించారు వైష్ణవి చైతన్య ఈ సందేశాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వెంటనే, అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అభిమానులు ఈ పోస్ట్‌పై ప్రేమాభిమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కుటుంబసభ్యులపై ఆమె చూపే ఆప్యాయత, ప్రేమ పట్ల ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు.వైష్ణవి తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, కుటుంబానికి, తన ప్రేమ పంచుకునేందుకు క్షణం వెచ్చించడం ఆమె ప్రత్యేకత. ఆమె పుట్టినరోజు సందేశం సోదరుడిపై ఉన్న బలమైన బంధాన్ని మరింత నలుగురికి అందిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Thеrе wаѕ nо immediate response frоm iѕrаеl, whісh hаѕ соnѕіѕtеntlу ассuѕеd thе un of іnѕtіtutіоnаl bіаѕ against іt. Stuart broad archives | swiftsportx. Mushroom ki sabji : 5 delicious indian mushroom recipes brilliant hub.