ఏపీ మందుబాబులకు మరో శుభవార్త

Another good news for AP dr

ఏపీ మందుబాబులకు సర్కార్ వరుస గుడ్ న్యూస్ ను అందజేస్తూ కిక్ ను పెంచేస్తుంది. జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలతో కూడా రూ.99కే మద్యం అమ్మించాలని ప్రయత్నిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా వెల్లడించారు. ‘రూ.99 మద్యానికి మంచి ఆదరణ వస్తోంది. ఇప్పటివరకు 5లక్షల కేసులకు పైగా విక్రయాలు జరిగాయి. పేరొందిన సంస్థలు సైతం ఈ మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాయి. అవి కూడా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుని, ఆ తర్వాత నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాయి’ అని మంత్రి చెప్పుకొచ్చారు.

ఏపీలో అధికారం చేపట్టిన కూటమి సర్కార్..రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొత్త మద్యం షాపుల్లో అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.. అన్ని బ్రాండ్ల మద్యం కూడా అందుబాటులోకి రావడంతో మద్యం ప్రియులు జోరుగా మద్యాన్ని కొనుగోలు చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్వార్టర్‌ రూ.99 మద్యం కూడా షాపుల్లో అందుబాటులోకి రావడంతో అవి కూడా జోరుగానే అమ్మకాలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటె తాజాగా మరో గుడ్ న్యూస్ ను మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలతో కూడా రూ.99కే మద్యం అమ్మించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.99 మద్యానికి మంచి ఆదరణ వస్తోందని.. ఇప్పటి వరకు 5 లక్షకేసులకు పైగా విక్రయాలు జరిగాయి అన్నారు. జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థలు సైతం ఈ మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయో చూస్తున్నట్లు తెలిపారు. అవి కూడా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుని ఆ తర్వాత నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాయన్నారు. ఇప్పటికే పలు కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్లు పేర్కొన్నారు.

గత వైసీపీ హయాంలో కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా మద్యం షాపుల్ని కేటాయించామని.. నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రభుత్వానికి రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వంలో రూ.1,800 కోట్ల అవినీతి జరిగిందని.. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బ్రాండ్లు సైతం అమ్మకాలు పూర్తిగా ఆగిపోయాయన్నారు. రూ.99కే నాణ్యమైన మద్యాన్ని మాత్రమే అందుబాటులోకి తెచ్చామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Will provide critical aid – mjm news.