మహారాష్ట్రలోనూ ఓటేయనున్న తెలంగాణ ఓటర్లు

maharashtra polling

మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఉద్యమ నుండి పోలింగ్ జరుగుతుంది. మొత్తం 4,136 మంది అదృష్టం పోటీ చేస్తున్నారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మహారాష్ట్రలో 9,63,69,410 మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. అందుకే 1,00,186 పోలింగ్‌ బూత్‌లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు ఈసీ తెలిపింది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. అలాగే ఇదే రోజు ఝార్ఖండ్‌లో 38 స్థానాలకు గాను రెండో విడత పోలింగ్ జరుగుతుంది.

మహారాష్ట్రలో బీజేపీ, అజిత్​ పవార్​-ఎన్​సీపీ, ఏకనాధ్​ శిందే నేతృత్వంలోని శివసేన కలిసి మహాయుతిగా ఏర్పడ్డాయి. దీనికి పోటీగా కాంగ్రెస్​, శివ సేన (యూబీటీ), ఎన్​సీపీ (శరద్ పవార్​) కలిసి మహావికాస్​ అఘాడీగా ఏర్పడ్డాయి. దీంతో ఈసారి మహారాష్ట్ర ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. విపక్ష కూటమి మహావికాస్ అఘాడీ (MVA)లో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్‌ పవార్‌కు చెందిన ఎన్సీపీ ఉన్నాయి. కాంగ్రెస్‌ 101 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. శివసేన యూబీటీ 95 మందిని, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ 86 మందిని పోటీకి దించింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరని కొన్ని స్థానాల్లో కూటమి పక్షాలు స్నేహపూర్వక పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 237 మంది అభ్యర్థులను నిలపగా, ఎంఐఎం కూడా తమకు పట్టుందని భావిస్తున్న 17 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది. ఇక మహారాష్ట్రలో 9 గంటల వరకు 6.61 శాతం నమోదు అయినట్లు సమాచారం. ఇదిలా ఉంటె తెలంగాణ లోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని 12 గ్రామాల ప్రజలకు మహారాష్ట్రలోనూ ఓటు హక్కు ఉంది. పరందోళి, గౌరి, పద్మావతి, ముక్దంగూడ, బోటాపటార్, ఇసాపూర్, లెండిగూడ, ఇందిరానగర్, శంకర్ లొద్ది, మహారాజ్ గూడ, అంతాపూర్ ప్రజలకు రాజురా నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది. ఈ గ్రామాల్లో 3 వేలకుపైగా ఓటర్లు ఉన్నారు. కాగా రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉన్న కెరమెరి మండలం ఎప్పటి నుంచో వివాదంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Taiwan’s scenic tourist destination faces earthquake risks from active faults – mjm news.