నేడు వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

farmers festival at mahabunagar from today

వరంగల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈరోజు వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం రూ.95 కోట్లతో నిర్మాణం పూర్తి చేసిన కాళోజీ కళాక్షేత్రం భవనాన్ని మంగళవారం ప్రారంభించనున్నారు. అలాగే హన్మకొండ నగరంలో నిషేధిత మత్తు పదార్థాలను నిరోధించేందుకు రూ.12 లక్షల వ్యయంతో నార్కోటిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయగా దానిని సీఎం ప్రారంభించనున్నారు. రూ.8.30 కోట్లతో కరీంనగర్‌-వరంగల్ జాతీయ రహదారిపై నిర్మించిన నయీం నగర్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. రూ.32.50 కోట్లతో నిర్మించతలపెట్టిన మున్సిపల్ పరిపాలన భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ నగరవాసులకు ఇచ్చిన ప్రధాన హామీల్లో అండర్ డ్రైనేజీ నిర్మాణం ఒకటి. ఈ ప్రతిష్ఠాత్మకమైన అభివృద్ధి కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రూ.4,170 కోట్లు కేటాయింపు చేసింది. దీనికి సంబంధించిన పనులను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అలాగే రూ.28 కోట్లతో హన్మకొండలో పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని నిర్మించనున్నారు. ఈ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రూ.80 కోట్లతో ఇంటర్నల్ రింగ్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పనులకు రూ.3 కోట్లతో శంకు స్థాపన చేయనున్నారు. కేఎం పీపీ టౌన్షిప్ ఆర్ అండ్ ఆర్ లేఅవుట్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, 863 ప్లాట్లు, రూ.43.15 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.160.3 కోట్లతో అలాగే ఫ్లడ్ డ్రైనేజీ సిస్టం పనులకు శంకుస్థాపన, రూ.13 కోట్లతో పీహెచ్‌సీ, ప్రైమరీ స్కూల్ కేఎంపీపీ టౌన్షిప్ శంకుస్థాపన, రూ.49.50 కోట్లతో రహదారుల అభివృద్ధి, పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట రోడ్డు 4 లైన్ల విస్తరణకు రూ.6.50 కోట్లతో పనులు పనులను ప్రారంభించనున్నారు.

హన్మకొండలో నిర్మితమైన ఈ కళాక్షేత్రం 4.20 ఎకరాల విస్తీర్ణంలో రూ.95 కోట్ల వ్యయంతో 1.77 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రధాన ఆడిటోరియం 1,127 మంది సీటింగ్ సామర్థ్యంతో 4 గ్రీన్ రూములు, ఆడియో సిస్టమ్‌తో కూడిన ఒక రిహార్సల్ హాల్, ఆధునిక వీడియో ప్రొజెక్టర్, స్టేజ్ లైటింగ్ ఏర్పాటు చేశారు. 3 ఫంక్షన్ లాబీలు, 6 రూములు, కాళోజీ ఆర్ట్ గాల్లరీ, 500 కేవీఏ జనరేటర్, ట్రాన్స్‌ఫార్మర్, ఎలివేటర్లు ఏర్పాటు చేశారు. వీల్ చైర్లకు అనుకూలమైన ర్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు కళాక్షేత్ర ఆవరణలో కాళోజీ విగ్రహం, చెట్లు, రెండు ఫౌంటైన్లు, గ్రీనరీని అభివృద్ధి చేశారు. అత్యాధునిక ఆడియో-విజువల్ సిస్టమ్‌తో సాంస్కృతిక కార్యక్రమాలు, థియేటర్ ప్రదర్శనలు, ఇతర కళారంగ కార్యక్రమాలకు అనువైన వేదికగా మారనుంది. కళాక్షేత్రం ప్రారంభోత్స వానికి ముందుగా కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని ఆవిష్కరించి ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు. అనంతరం కాళోజీ జీవితంపై చేసిన షార్ట్ ఫిల్మ్‌ను సీఎం ఆడిటోరియంలో వీక్షించనున్నారు.

కాగా, హైదరాబాద్ తరవాత వరంగల్ పట్టణంలో అండర్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు ప్రతిపాదనలు వెళ్లాయి. వివిధ కారణాలతో పనులు కార్యరూపం దాల్చలేదు. సీఎం ప్రత్యేక దృష్టి పెట్టి అండర్ డ్రైనేజీ నిర్మాణం కొరకు రూ.4,170 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులకు మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. బల్దియా పరిధి 408 చదరపు కిలో మీటర్లు కాగా డ్రైనేజీ పైప్‌లైన్ పొడవు 3184 .98 చదరపు కిలో మీటర్లుగా అంచనా వేశారు. గ్రేటర్ వరంగల్‌కు పరిపాలన మాస్టర్ ప్లాన్ ఆమోదించడంతో పాటు పరిపాలన భవనానికి రూ.32.50 కోట్లతో నిధులు మంజూరు చేశారు. జిల్లాకు ఐకాన్‌లాగా నిర్మించేలా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ప్రస్తుతం ఉన్న మున్సిపల్ భవనం 50 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ భవనాన్ని 50,052.18 ఎస్ఎఫ్టీలో సెల్లార్, గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు నిర్మాణం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న భావన ప్రాగణంలోనే నూతన భవనాన్ని నిర్మించేందుకు మున్సిపల్ శాఖ సిద్ధమైంది. వరంగల్ కరీంనగర్ రహదారిపై నయీమ్ నగర్ వద్ద ఉన్న ప్రధాన రహదారిపై ఎన్నో ఏళ్లగా వేచి చూస్తున్న మోరి, బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. వాటిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The technical storage or access that is used exclusively for anonymous statistical purposes. : 200 – 400 dkk pr. Navigating health savings accounts (hsas) : your guide to smart healthcare saving.