నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్-20 ఉపగ్రహం..

SpaceX to Launch India’s Communication Satellite GSAT-20

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్‌-20 ప్రయోగం సక్సెస్‌ అయ్యింది. స్పేస్‌ఎక్స్‌ కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ఈ జీశాట్‌-20ను నింగిలోకి విజయవంతంగా మోసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్‌ కెనావెరల్‌ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం విజయవంతమైనట్టు ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ఛైర్మన్‌, ఎండీ రాధాకృష్ణణ్‌ దురరురాజ్‌ తెలిపారు. ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఆయన.. జీశాట్‌-20 కచ్చితమైన కక్ష్యలోకి చేరింది అని వెల్లడించారు.

34 నిమిషాల పాటు ప్రయాణించిన తరువాత ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. అనంతరం హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకోనుంది. 4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్‌లు తీసుకెళ్లేందుకు సాధ్యపడకపోవడంతో స్పేస్‌ ఎక్స్‌ ద్వారా ఇస్రో ప్రయోగించింది. జీశాట్‌-20 ఉపగ్రహం 14 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. వాణిజ్య పరంగా ఇస్రో, స్పేస్‌ఎక్స్‌ మధ్య ఇదే తొలి ప్రయోగం. భారత్‌లోని మారుమూలు ప్రాంతాలు, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్‌ సేవలను అందించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. అంతేకాకుండా అడ్వాన్స్‌డ్‌ బ్యాండ్‌ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని రూపొందించింది. జీశాట్‌-ఎన్‌2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వై-ఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ఈ ప్రయోగానికి వినియోగించిన 549 టన్నులుండే ఫాల్కన్‌ 9 బీ-5 రాకెట్‌లో రెండు దశల్లో పనిచేస్తుంది. ప్రయోగ వాహనం కక్ష్య వేగాన్ని అందుకోడానికి దాని రెండు విభిన్న దశలు వరుసగా ప్రొపల్షన్‌ను అందిస్తాయి. ఈ రాకెట్‌ 8,300 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను జియోసింక్రోనస్‌ కక్ష్యకు, 22,800 కిలోల శాటిలైట్స్‌ను భూమి దిగువ కక్ష్యకు చేర్చగలదు.

మరోవైపు జీశాట్‌-20 ఉపగ్రహం 14 ఏండ్ల పాటు సేవలు అందించనుందని, భూకేంద్రంలోని మౌలికసౌకర్యాలు శాటిలైట్‌‌తో అనుసంధానం కానుందని ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ అన్నారు. బెంగళూరులోని యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ నుంచి ప్రయోగాన్ని ఆయన పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. కచ్చితమైన కక్ష్యలోకి ఉపగ్రహం చేరడంతో ప్రయోగం విజయవంతమైంది. ఉపగ్రహంలో ఎటువంటి సమస్యలు లేవు.. సోలార్ ప్యానెల్లు అమర్చామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Life und business coaching in wien – tobias judmaier, msc. Hest blå tunge. With businesses increasingly moving online, digital marketing services are in high demand.