10 సంవత్సరాలలో చేసింది కేవలం 7 సినిమాలే : హృతిక్ రోషన్

hrithik roshan

బాలీవుడ్‌లో షారుఖ్‌ ఖాన్‌, ఆమీర్ ఖాన్‌, సల్మాన్ ఖాన్‌లు ఓ ఊపు ఊపుతున్న సమయంలో నెపో కిడ్‌గా, రాకేష్‌ రోషన్‌ వారసుడిగా హృతిక్‌ రోషన్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. కెరీర్‌ ఆరంభంలోనే మంచి సినిమాలు చేసినా నెపోకిడ్ అంటూ చాలామంది కామెంట్స్ చేశారు. విమర్శలను పట్టించుకోకుండా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్‌ అయ్యే విధంగా కష్టపడి సినిమాలు చేసి ఇండస్ట్రీలో టాప్‌ పొజీషన్‌కి చేరుకున్నారు. ఖాన్‌ల త్రయం స్థాయిలో హృతిక్‌ రోషన్‌కి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో పాటు సూపర్‌ హిట్‌ దక్కాయి. అయితే ఇదంతా గతం.. ఇప్పుడు పరిస్థితి వేరు అన్నట్లుగా ఆయన అభిమానులు స్వయంగా సోషల్‌ మీడియాలో వాపోతున్నారు.

హృతిక్‌ రోషన్‌ కెరీర్‌ ఆరంభంలో ఏడాదికి మూడు నాలుగు, ఆ తర్వాత రోజుల్లో ఏడాదికి రెండు చొప్పున సినిమాలు చేశారు. హృతిక్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి దాదాపు పాతిక సంవత్సరాలు కాబోతుంది. ఈ పాతికేళ్లలో మొదటి 15 ఏళ్లు బాగానే సినిమాలు చేసిన ఈయన చివరి పదేళ్లలో కేవలం ఏడు సినిమాలు మాత్రమే చేశారు. అందులో హిట్‌ రేటు ఎక్కువ ఉన్నా వరుసగా సినిమాలను మాత్రం చేయడం లేదు. వ్యక్తిగత కారణాలు చెప్పి కొన్నాళ్లు బ్రేక్‌ తీసుకున్న హృతిక్‌ రోషన్‌ ఇంకా కొత్త సినిమాల ఎంపిక విషయంలో జోష్ కనబర్చడం లేదు. రెండేళ్లకు ఒకటి అన్నట్లుగా సినిమాలు చేస్తున్నారు. సక్సెస్‌ రేటు ఎక్కువ ఉన్న హృతిక్‌ వంటి హీరోలు సినిమాలు ఎక్కువ చేయక పోవడం ఇండస్ట్రీకి నష్టం కలిగిస్తుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అభిమానులు సైతం హృతిక్ వరుసగా సినిమాలు చేయక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సోషల్‌ మీడియాలో ఏకంగా వరుసగా సినిమాలు చేయకుంటే రిటైర్మెంట్‌ తీసుకో అంటూ హ్యాష్ ట్యాగ్‌ను షేర్‌ చేశారు. ఆ హ్యాష్ ట్యాగ్‌ జాతీయ స్థాయిలో ట్రెండ్‌ అయింది. అసలు హీరోని అభిమానులే ఇలా ట్రోల్ చేయడం కాస్త అరుదే.

హృతిక్‌ రోషన్‌ ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీకి, మీడియాకు చెందిన పలువురు సైతం ఈ హ్యాష్ ట్యాగ్‌తో వరుసగా సినిమాలు చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి హృతిక్‌ ఈ ట్రెండ్‌ పై ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ప్రస్తుతం చేస్తున్న సినిమా కాకుండా కొత్తగా మరే సినిమాకు హృతిక్‌ కమిట్‌ అవ్వలేదు. ప్రస్తుతం అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్‌ రోషన్‌ ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The technical storage or access that is used exclusively for statistical purposes. Hest blå tunge. As a small business owner, grasping the nuances of financial terms is crucial for informed decision making.