RGV కి బిగ్ షాక్..

varma

డైరెక్టర్ , వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ కు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ అండ చూసుకొని వర్మ..చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపర్చేలా గతంలో రాంగోపాల్ వర్మ పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల దీనిపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని రాంగోపాల్ వర్మకు ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు. అయితే, అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆర్జీవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆయన అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది.

తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు వర్మ. సోమవారం హైకోర్టులో పిటిషన్ పై విచారణ చేయగా.. పిటిషనర్‌కి నోటీసులు జారీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ లాయర్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించగా.. పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారన్న వర్మ తరఫున లాయర్ కోర్టుకు తెలిపారు. వాస్తవానికి మద్దిపాడు పోలీసులు వర్మను విచారణకు పిలిచారు.. మంగళవారం రావాలన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు ధర్మాసనం ముందు వర్మ తరఫు లాయర్ ప్రస్తావించారు. విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరగా.. సమయానికి సంబంధించిన అంశాన్ని పోలీసుల ముందు తేల్చుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. అలాంటి అభ్యర్థనలు తమ ముందుకు తీసుకురావొద్దని సూచించింది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై వివాదం నడిచింది. వర్మ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా వరుసగా సోషల్ మీడియాలో వర్మ పోస్టులు చేశారు. దీనిపై అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. వర్మ పై టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Guаrdіоlа’ѕ futurе іn fresh dоubt wіth begiristain set tо lеаvе manchester city. Stuart broad truly stands as a force to be reckoned with in the world of test cricket. New youtube channel ideas 2020.