అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సభ ప్రారంభంలో ప్రశ్నోత్తరాల సెషన్ జరగనుంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు అసెంబ్లీలో చర్చకు రానున్నాయి.
2017-18, 2018-19 సంవత్సరాల హిందూపూర్ అర్బన్ డెవలప్‌మెంట్ ఆడిట్ రిపోర్టుల ఆలస్యానికి కారణాలను సభ ముందు మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశపెట్టనున్నారు. డివిజినల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీలో సభ్యుని ఎంపికకు ప్రతిపాదనను మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సభ ముందుకు తీసుకురానున్నారు.
ఇక, ఈ సమావేశాల్లో ఏపీ పంచాయితీరాజ్ సవరణ బిల్లు 2024, ఏపీ మున్సిపల్ లా సవరణ బిల్లు 2024, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024, ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లులపై చర్చ జరగనుంది. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాంట్‌లకు సంబంధించిన బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి.