మహారాష్ట్ర గడ్డపై గబ్బర్ సింగ్ వార్నింగ్

pawan warning

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన స్పీచ్ తో అదరగొట్టారు. శనివారం డేగ్లూర్ బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సభకు హాజరైన శ్రేణుల్లో ఉత్సాహం నింపిన పవన్.. చాలా వరకు హిందీ, మరాఠాలో ప్రసంగించారు. అక్కడి ప్రజలకు రాష్ట్రంలో మహాయుతి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. సనాతన ధర్మ కోసం బలంగా పోరాడాలని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ కారణంగానే ఇక్కడి దేవాలయాలు భద్రంగా ఉన్నాయన్నారు. అక్రమార్కుల్ని సరిహద్దుల్లోనే తరిమికొట్టిన ఘటన శివాజీకే సొంతమవుతుందంటూ నమస్కరించారు.

ఛత్రపతి శివాజీ మహరాజ్ నడిచిన నేలపై తాము ఎవరికీ భయపడేది లేదని, సినిమాల్లో పోరాటాలు చేయడం, గొడవ పెట్టడం చాలా ఈజీ అని.. నిజ జీవితంలో ధర్మం కోసం కొట్లాడటం, నిలబడటం చాలా కష్టమని తెలిపారు. దేశంలో ప్రతి హిందువు గుండెలో రామనామం లేకుండా ఉండదని అన్నారు. హిందువులంతా ఏకమైతే దేశాన్ని విచ్ఛినం చేసేందుకు వచ్చే వాళ్లు ఎంత అంటూ హాట్ కామెంట్ చేశారు. ఛత్రపతి శివాజీ నడిచిన నేలలో ఎలాంటి దమ్కీలకు భయపడేది లేదని మజ్లిస్ పార్టీ నేతలకు పవన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

మనమంతా విడిపోయి బలహీన పడిపోదామా.? కలిసి అభివృద్ధి వైపు అడుగులు వేద్దామా అని ప్రశ్నించారు. సామాన్యుడు అనుకుంటే.. అందరూ సామాన్యులే అని కానీ.. బలమైన సంకల్పం ఉంటే అందరూ అసమాన్యులే అని అన్నారు. మన దేశం కోసం, మన ధర్మం కోసం నిలబడాలంటూ కార్యకర్తక దిశానిర్దేశం చేశారు. ఎవడో.. హైదరాబాద్ నుంచి వచ్చి 15 నిముషాలు చాలు అనే వాళ్లకు బలమైన సమాధానం చెప్పాలంటూ పిలుపునిచ్చారు. ఇది ఛత్రపతి శివాజీ నేల అని.. అలాంటి బెదిరింపులకు భయపడమంటూ హెచ్చరించారు.

మీరు తల్వారులు పట్టుకొస్తే.. మేం చేతులు కట్టుకుని కూర్చొంటామా అంటూ ప్రశ్నించారు. ఓసారి మత ప్రాతిపాదికన ఈ దేశం విడిపోయిందని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్.. మేం చేతకాని వాళ్లం కాదు అని హెచ్చరించారు. సాధ్యమైనంత శాంతంగా ఉంటాం, బరిస్తాం, కానీ.. హద్దులు దాటితే మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Read more about un реасеkеереrѕ іn lebanon ѕау iѕrаеl hаѕ fіrеd on thеіr bаѕеѕ deliberately. Stuart broad archives | swiftsportx. Mushroom ki sabji : 5 delicious indian mushroom recipes brilliant hub.