రిపోర్టర్‌కు నవ్వుతూనే రానా కౌంటర్లు

rana daggubati

ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు, అయితే ఈసారి సినిమా ద్వారా కాదు, ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా. నవంబర్ 23న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ది రానా దగ్గుబాటి షో అనే కొత్త టాక్ షో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ షోకు రానా హోస్ట్‌గా మాత్రమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ షో ప్రమోషన్‌లో భాగంగా రానా మీడియా ముందుకు వచ్చి పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ఓ జర్నలిస్ట్ రానాను టైర్ 2 హీరోలు గురించి ప్రశ్నించగా, రానా హాస్యంగా స్పందిస్తూ, వాళ్లు ఏమైనా ట్రైన్‌లా టైర్‌లు, బెర్త్‌లు ఎవరు ఇచ్చారు అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాని, సిద్దు, నాగ చైతన్య, అఖిల్, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలను టైర్ 2 హీరోలుగా చెప్పడం సాధారణంగా కనిపిస్తుండగా, ఈ ప్రశ్నకు రానా ఆందోళన లేకుండా, సరదాగా స్పందించడం అందరినీ ఆకట్టుకుంది. ది రానా దగ్గుబాటి షో ఇప్పటికే నాని, సిద్దు జొన్నలగడ్డ, రిషభ్ శెట్టి, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, శ్రీలీల, రామ్ గోపాల్ వర్మ తదితరులతో ఎపిసోడ్లు షూట్ పూర్తయినట్లు సమాచారం.

స్టార్ హీరోలు ఈ షోలో లేకపోవడం కొంతమందికి నిరుత్సాహం కలిగించినా, ఈ షోకు ఉన్న కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో రానా ఉన్నారు.సినిమాల్లో వరుసగా కనిపించకపోవడంపై రానా మాట్లాడుతూ, గుడ్ కాన్సెప్ట్ ఉన్న కథలు వస్తే తప్పకుండా సినిమాలు చేస్తాను. లీడర్ లాంటి విభిన్నమైన చిత్రాల కోసం వేచి చూస్తున్నాను, అన్నారు. ఈ మధ్య కాలంలో ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని, అయితే ఇప్పుడు కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు వచ్చిన టాక్ షోలను మించి, ప్రేక్షకుల అనుభవాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు మేము కష్టపడ్డాం,” అని రానా అన్నారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకు తన షో తేడాగా ఉంటుందని కూడా స్పష్టం చేశారు.ఈ టాక్ షో తొలి ఎపిసోడ్‌లో ఏ సెలబ్రిటీ పాల్గొంటారనే విషయంపై త్వరలోనే అమెజాన్ అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ వన్ యారీ తర్వాత రానా మరో టాక్ షోతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Contact pro biz geek. Advantages of overseas domestic helper. Die fliege heinz erhardt.