సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత

CM Chandrababu brother Ramamurthy Naidu passed away

హైదరాబాద్‌: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. అనారోగ్యం బారిన పడిన ఆయన గతకొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు సహా ఇతర కార్యక్రమాలన్నీ మంత్రి నారా లోకేష్ రద్దు చేసుకున్నారు. ఆసుపత్రికి సైతం చేరుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు.

1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ తెలుగు సినిమా నటుడు. రోహిత్ పలు హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. రామ్మూర్తి మరణవార్త తెలిసిన టీడీపీ శ్రేణులు సంతాపం ప్రకటిస్తున్నారు.

కాగా, వాస్తవానికి చంద్రబాబు ఈరోజు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లి… ఎన్డీయే తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. తమ్ముడి ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. కాసేపట్లో ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Contact pro biz geek. For details, please refer to the insurance policy. Der römische brunnen | ein gedicht von conrad ferdinand meyer.