తమ్ముడి ఆరోగ్య పరిస్థితి విషమం.. సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు

health condition of the younger brother is serious. CM Chandrababus visit to Maharashtra is cancelled

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే, ఈరోజు ఉదయం చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంత్రి నారా లోకేశ్ హుటాహుటీన హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ క్రమంలో ఈరోజు తన అన్ని కార్యక్రమాలను లోకేశ్ రద్దు చేసుకొని హైదరాబాద్ చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే, తమ్ముడి ఆరోగ్యం విషమంగా ఉండటంతో చంద్రబాబు కూడా తన మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు.

కాగా, సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ న్యూఢిల్లీలోని తాజ్ ప్లాలెస్ లో జరిగే మీడియా కాన్‌క్లేవ్ లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2గంటలకు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు చంద్రబాబు నాయుడు వెళ్లాల్సి ఉంది. సాయంత్రం 5.30 గంటలకు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా థానేలో జరిగే ప్రచార సభలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే, తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మహారాష్ట్ర పర్యటనను చంద్రబాబు రద్దు చేసుకున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు చంద్రబాబు చేరుకోనున్నారు. ఇప్పటికే తన సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితిపై వివరాలను కుటుంబ సభ్యులు, ఆస్పత్రి వైద్యులతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడి తెలుసుకున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. It’s just that mоѕt оf the gаіnѕ frоm thаt hаvе gone tо thе top. Belgian police shut down a far right conference as it rallies ahead of europe’s june elections.